'బిగ్ బాస్' కి వెళ్లేందుకు రష్మీ షాకింగ్ కండీషన్స్..?

Anilkumar
తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే మరో సరికొత్త సీజన్లో ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ హోస్ట్ గా ఉంటున్న నాగార్జున ఈసారి తప్పుకుంటున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్-7 కి సరికొత్త హ్హోస్ట్ ను వెతికే పనిలో ఉన్నారట నిర్వాహకులు. అంతేకాదు అటు కంటెస్టెంట్ల మీద కూడా ఈసారి ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. 

అయితే ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా దగ్గుపాటి రానా,  నందమూరి బాలకృష్ణ ఇద్దరిలో ఎవరో ఒకరు వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్స్ విషయానికొస్తే గత సీజన్స్ మాదిరిగానే బుల్లితెరపై అలరించిన కొంతమంది టాప్ సెలబ్రిటీస్ ని ఈసారి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ను బిగ్ బాస్ సీజన్-7 లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్స్ చేస్తున్నారట నిర్వాహకులు. అయితే రష్మీ కూడా ఎందుకు ఓకే చెప్పినా కొన్ని కండిషన్స్ పెడుతోందట. అదేంటంటే బిగ్ బాస్ హౌస్ లో తనకు వారానికి 10 లక్షల పైగా  రెమ్యునేషన్ ఇవ్వాలని కండిషన్ పెడుతుందట.గతంలో యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఆమెకు భారీగా రెమ్యునేషన్ ఇచ్చారు.

ఇప్పుడు రష్మీ కూడా భారీగా డిమాండ్ చేస్తుందని అంటున్నారు. ఒకవేళ రష్మీ డిమాండ్ కి బిగ్ బాస్ టీం ఓకే చెప్తే ఆమెకు ఈ షో ద్వారా ఆమె కోటికి పైగా రెమ్యూనరేషన్ అందబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి బిగ్ బాస్ టీం రష్మీ రెమ్యూనరేషన్ విషయంలో ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కెరీర్ పరంగా రష్మీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో రష్మీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక మరోవైపు బిగ్ బాస్ గత సీజన్ కు అనుకున్నంత టిఆర్పి రాలేదు. ఒక విధంగా సీజన్-6 ఆడియన్స్ కి తీవ్ర నిరాశను మిగిల్చింది. అందుకే సీజన్-7 ని మాత్రం మరింత వినోదాత్మకంగా తీర్చిదిద్దే పనిలో ప్రస్తుతం బిగ్ బాస్ టీం ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: