అల్లు అర్జున్ లో నా తమ్ముడు పునీత్ ని చూసుకుంటున్నా అంటూ ఎమోషనల్ అయిన శివ రాజ్ కుమార్..!?

Anilkumar
కన్నడ ఇండస్ట్రీలో కంటిరవ రాజ్ కుమార్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చి హీరోగా దాదాపు 125 సినిమాలలో నటించి తనదైన నటనతో ఎంతోమంది ప్రేక్షకు అభిమానులను అలరించి ఇతర భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించి ఇతర భాషల అభిమానులను కూడా సంపాదించుకున్నారు కరునాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్. పెద్ద తమ్ముడు గా రాఘవేంద్ర రాజ్ కుమార్ నటుడిగా నిర్మాతగా కూడా రాణించాడు. ఇక ఆయన రెండవ తమ్ముడు పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని దక్కించుకున్నాడు. తెరపైనే కాకుండా తెర వెనక కూడా హీరోగా గుర్తింపు పొందాడు పునీత్ రాజ్ కుమార్. హీరో గానే కాకుండా స్కూల్ కాలేజీల ద్వారా కూడా ఎంతోమంది పేద విద్యార్థులకు ఫ్రీగా విద్యను అందించాడు. 

వాటితో పాటు గోశాలలు ఆసుపత్రిలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు పునీత్ రాజ్ కుమార్. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఈయన ఎవరు ఊహించిన విధంగా దేవుడు దగ్గరికి వెళ్లిపోయాడు. ఈయన మరణానంతరం ఏ వేడుకలో పునీత్ ప్రస్తావన వచ్చినప్పటికీ శివరాజ్ కుమార్ చాలా భావోద్వేగానికి గురవుతూ ఉంటాడు. ప్రతి వేడుకలు కూడా తన తమ్ముడిని తలుచుకుంటూ కన్నీటి పర్యంతం అవుతూ ఉంటారు. అయితే తాజాగా ఆయన నటించిన వేదా సినిమా తెలుగులో విడుదల కావడం జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య అతిథిగా వచ్చాడు. ఇందులో భాగంగానే తన తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ కి సంబంధించిన పెట్టారు. ఇక పునీత్ రాజ్ కుమార్ ఇవి చూడగానే శివన్న చాలా భావోద్వేగానికి గురై కంటతడు పెట్టుకున్నాడు.

ఇక ఆ సమయంలో బాలయ్య ఆయన్ని ఓదార్చారు.ఇందులో భాగంగానే వేద సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పునీత్ రాజ్ కుమార్ మరియు అల్లు అర్జున్ గురించి శివన్న కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేయడం జరిగింది. ఇందులో భాగంగానే శివన్న మాట్లాడుతూ నా తమ్ముడు పునీత్ ని అల్లు అర్జున్ లో చూసుకుంటూ ఉంటాను అల్లు అర్జున్ డాన్స్ చేసే స్టైల్ నాకు పునీత్ డాన్స్ చేసినట్లుగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ డాన్స్ చేసిన బుట్ట బొమ్మ లాంటి పాట నేను కూడా చేయాలని అనుకుంటున్నాను.. ఆయనలా డాన్స్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు శివరాజ్ కుమార్. ఇందులో భాగంగానే ఆయన నటించిన వేద సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో గ్రాండ్గా విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: