భోళా శంకర్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!

Divya
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్.. వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ తో ఊపు మీద ఉన్న చిరంజీవి ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను అంతకుమించి అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్ గా, కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో నటించడం గమనార్హం. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫోటోస్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా భోళా శంకర్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమాలో పూనకాలు లోడింగ్ పాట సినిమాకు ఏ రేంజ్ లో హైలెట్ గా నిలిచిందో భోళా శంకర్ సినిమాలో కూడా ఒక పాట మాస్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చేలా కనిపిస్తోందని సమాచారం. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాట కోసం అద్భుతమైన డాన్స్ స్టెప్పులను ప్రిపేర్ చేశారట. అంతేకాదు ఇక్కడ మరొక అప్డేట్ ఏమిటంటే ఈ పాటలో చిరంజీవితో కలిసి ఆయన తనయుడు రామ్ చరణ్ ఇరగదీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా వీరిద్దరికీ సంబంధించి స్టెప్పులను కూడా సిద్ధం చేశారు అని త్వరలోనే ఈ పాట షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.
ఈ విషయం తెలిసి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  నిజానికి రాంచరణ్ , చిరంజీవి కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని చాలా సంతోషపడేవారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ భోళాశంకర్ సినిమాలో కనిపించబోతున్నారని తెలిసి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.  కాకపోతే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఫుల్ లెంగ్త్ సినిమా ఆచార్య మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఇప్పటికే మగధీర సినిమాలో బంగారు కోడిపెట్ట పాటలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు.  ఆ సినిమా సూపర్ హిట్ సక్సెస్ అయింది ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో కూడా ఒక పాటలో నర్తించబోతున్నారు కాబట్టి ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: