రిస్క్ చేస్తున్న తలపతి విజయ్.. మరోసారి 'వారసుడు' కాంబినేషన్ రిపీట్..?

Anilkumar
టాలీవుడ్ లో కమర్షియల్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు వంశీ పైడిపల్లి. మహేష్ బాబుతో మహర్షి వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఏడాది కోలీవుడ్ అగ్ర హీరో తలపతి విజయ్తో 'వారిసు' అనే సినిమాని తెరకెక్కించాడు వంశీ పైడిపల్లి. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాతోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో 'వారసుడు' అనే టైటిల్ తో ఈ సినిమాని విడుదల చేయగా.. ఇక్కడ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా కూడా భారీ కలెక్షన్స్ ని సాధించింది. 

అయితే సినిమాలో కథ, కథనాలు కొత్తగా లేకపోయినా దళపతి విజయ్ క్రేజ్ వల్ల సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 250 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో విజయ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించగా తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. కాగా ఇదిలా ఉంటే తాజాగా మరోసారి వారసుడు కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దళపతి విజయ్ వంశీ పైడిపల్లికి మరో సినిమా చేసే అవకాశం ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే విజయ్ వంశీ పైడిపల్లి తో ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్లు ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

ఒకవేళ వంశీ రెడీ చేసిన కథ విజయ్ ను ఇంప్రెస్ చేస్తే అది తలపతి 69వ ప్రాజెక్ట్ గా రావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. అయితే ఇటీవల విజయ్తో కమర్షియల్ ఎలివెంట్స్ ని కలిపి దాన్ని కుటుంబ నేపథ్యాన్ని జోడించి సినిమాను బ్యాలెన్స్ చేసిన విధానం దళపతి విజయ్ కి బాగా నచ్చిందట. ఈ రీజన్ వల్లే వంశీ పైడిపల్లికి మరో సినిమా చేసే అవకాశం ఇస్తున్నాడని అంటున్నారు. మరి ఈసారి వంశి పైడిపల్లి విజయ్ కోసం ఎలాంటి స్క్రిప్ రెడీ చేస్తాడు అనేది చూడాలి. ఇక ప్రస్తుతం విజయ్ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్  దర్శకత్వంలో తన 67వ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి 'లియో' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఇటీవల విడుదలవగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో ట్రెండింగ్ లో ఉంది.అన్నట్టు ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: