శ్రీ లీల లకి,రాజశేఖర్ కి మధ్య ఉన్న బంధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును పొందాడు. అంతేకాదు అగ్ర హీరోలైనా చిరంజీవి బాలకృష్ణ తో సైతం గట్టి పోటీని ఇచ్చాడు రాజశేఖర్. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈయనకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా పరిచయమై స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన శ్రీ లీలకి మరియు సినీ హీరో రాజశేఖర్ కి  మధ్య ఒక చిన్న సంబంధం ఉంది అని అంటున్నారు. ఇక దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే రాజశేఖర్ కేవలం నటుడు మాత్రమే కాదు డాక్టర్ అని చాలామందికి తెలిసి ఉంటుంది.ప్రస్తుతం శ్రీ లీల  కూడా డాక్టర్ చదువుతోంది. అంతేకాదు ఈమె తల్లి కూడా ఒక ప్రముఖ డాక్టర్.ఇక తల్లి బాటలోనే ఈ ఏడాది శ్రీ లీల కూడా డాక్టర్ పట్టా తెచ్చుకోబోతోంది.సాధారణంగా ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు డాక్టర్ కాబోయే యాక్టర్ లు అయ్యాము అంటూ చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఇకఅలాంటి వారిలో రాజశేఖర్ శ్రీ లీల కూడా ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరకంగా చెప్పాలంటే శ్రీ లీలా మరియు సీనియర్ హీరో రాజశేఖర్ డాక్టర్లు అయిన తర్వాత యాక్టర్లు అయ్యారు. వీరితో పాటు అల్లు రామలింగయ్య హోమియోపతి డాక్టర్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

 అంతేకాదు సాయి పల్లవి కూడా గుండెకు సంబంధించిన వైద్య నిపునులుగా ఉన్నారు. రూప కుడివైయూరు కూడా డాక్టర్ మాత్రమే కాకుండా సాయి పల్లవి లాగా మంచి డాన్సర్ కూడా. అంతేకాదు వీరితో పాటు చాలామంది డాక్టర్లు అయిన తర్వాత సినీ ఇండస్ట్రీకి హీరోయిన్లు లేదా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ను చూపించుకున్నారు. అయితే ప్రస్తుతం శ్రీ లీల మరియు రాజశేఖర్ కి సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే ఇక శ్రీ లీల సినిమాల విషయానికి వస్తే ఇటీవల మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన దమక సినిమాలో హీరోయిన్గా నటించిన  ఈమె ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం ప్రస్తుతం  వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: