చిరుపై కోపంతో రగిలిపోతున్న నందమూరి ఫ్యాన్స్?

Purushottham Vinay
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'అమిగోస్'. ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో మూడు డిఫరెంట్ రోల్స్ తో హీరో, విలన్ తానే అయ్యి నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్. కొత్త దర్శకుడు రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కన్నడ యంగ్ అండ్ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ కళ్యాణ్ రామ్ కి జంటగా నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది ఈ హాట్ బ్యూటీ. ఇక వరుస విజయాలతో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా అజిత్ తునివు సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ అందించి ప్రశంసలు దక్కించుకున్నాడు జిబ్రాన్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ సాంగ్స్ మూవీ పై విపరీతంగా అంచనాలను క్రియేట్ చేశాయి.అయితే ఫిబ్రవరి 10న ఎటువంటి పోటీ లేకుండా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ రామ్ కి పోటీగా అదే వీకెండ్ లో తన సినిమా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.


చిరు ఇంత ఫాస్టా అనుకుంటున్నారా? అయితే విడుదలకు సిద్దమవుతుంది చిరు కొత్త సినిమా కాదు.. ఆయన ఓల్డ్ మూవీ మళ్ళీ రిలీజ్ కాబోతుంది.మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ 'గ్యాంగ్ లీడర్' సినిమా రీ రిలీజ్ కి ఇప్పుడు సిద్దమవుతుంది.ఇప్పటికే ఈ సినిమా రీ రిలీజ్ చాలా సార్లు కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెలలోనే పవన్ హిట్ సినిమాలు బద్రి, తొలిప్రేమ సినిమాలు కూడా రీ రిలీజ్ కి డేట్ ని ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఈ నెలలో సినిమా రిలీజ్‌లు కూడా చాలా ఎక్కువ ఉండడంతో థియేటర్ల సర్దుబాటు సరిగ్గా అవ్వడం లేదు. దీంతో పవన్ రెండు సినిమాలను వాయిదా వేసి చిరు సినిమాకి లైన్ క్లియర్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 11 వ తేదీన గ్యాంగ్ లీడర్ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఆ ముందురోజే కళ్యాణ్ రామ్ సినిమా అమిగోస్ సినిమా రిలీజ్ అవుతుంది. వీకెండ్ టైంలో కొత్త సినిమాకి అవకాశం ఇవ్వకుండా ఇలా పాత సినిమాని రిలీజ్ చేయడం ఏంటని నందమూరి అభిమానులు కోపంతో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: