పఠాన్‌: షారుఖ్ ఖాతాలో మరో రేర్ రికార్డ్?

Purushottham Vinay
ఎన్నో వివాదాలను ఎదుర్కొని పఠాన్‌ సినిమా జనవరి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.విడుదల ముందు నుండే ఈ సినిమాపై ఎక్కడ లేని బజ్‌ ఏర్పడింది. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మెదటి రోజే అనుకుంటే వరుసగా ఆరు రోజులు ఈ సినిమా ఏకంగా వంద కోట్ల గ్రాస్‌కు తగ్గకుండా కలెక్షన్‌లు రాబడుతూ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు ప్రాణం పోసింది. తాజాగా ఈ సినిమా దంగల్‌ హిందీ నెట్‌ కలెక్షన్‌లు కూడా క్రాస్ చేసి బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. షారుఖ్‌ఖాన్‌ యాక్షన్‌, దీపికా అందాలు ఇంకా జాన్‌ అబ్రహం విలనిజం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని థియేటర్‌లకు రిపీటెడ్‌గా వచ్చేలా చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డుని క్రియేట్‌ చేసింది.పఠాన్‌ మూవీ తాజాగా ఏకంగా రూ.400 కోట్ల నెట్‌ కలెక్షన్‌లను రాబట్టి.. ఆ ఫీట్‌ అందుకున్న ఫస్ట్ బాలీవుడ్‌ మూవీగా సరికొత్త రికార్డుని నెలకొల్పింది. 


ఇదే జోరు కొనసాగితే కేజీఎఫ్‌-2 లాంగ్ రన్ వసూళ్ల రికార్డును కూడా బద్దలు కొడుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఓవర్సీస్‌లో కూడా పఠాన్‌ వీర విహారం చేస్తున్నాడు. 'ఆర్‌ఆర్ఆర్‌', 'బాహుబలి-2' ఫుల్‌రన్‌లను జపాన్‌ ఇంకా చైనా రిలీజు లేకుండానే అధిగమించే అవకాశాలు పఠాన్ కి పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే జోరు ఇంకా కొనసాగితే మరో వారంలో పఠాన్‌ వెయ్యి కోట్ల మార్కును ఈజీగా అందుకోవడం ఖాయం. పైగా నార్త్‌లో అన్ని సెంటర్‌లలో ఈ సినిమా తప్ప వేరు ఆప్షన్‌ కూడా లేదు.ఫుల్ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌ ఖాన్ కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించింది. జాన్‌ అబ్రహం విలన్ గా నటించిన ఈ సినిమాను యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: