బ్లాక్ బస్టర్ మూవీ ని మిస్ చేసుకున్న సిద్దు..కారణం..?

Divya
మలయాళం సూపర్ హిట్ మూవీ గా తెరకెక్కిన కప్పెల సినిమాని తెలుగులో బుట్ట బొమ్మ అంటూ రీమేక్ చేసి తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అర్జున్ దాస్, సూర్య వశిష్ట , అనైకా లీడ్రోల్ నటించిన ఈ సినిమా శనివారం రోజు విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ తోనే ఆకట్టుకుందని చెప్పవచ్చు. అయితే ఈ ట్రైలర్ పై కొంతమంది నెగటివ్ గా కూడా కామెంట్లు చేశారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అనైకా చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అయితే హీరోయిన్ అయినా కూడా ఈమె ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ గానే కనిపిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బరువైన పాత్రను ఆమె మోయలేక పోయిందని చెప్పవచ్చు.
మరొకవైపు అర్జున్ దాస్ తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి బాగా సుపరిచితుడే.. సూర్య వశిష్ట మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదని వార్త వినిపిస్తోంది.  ఒరిజినల్ వెర్షన్ లో రోషన్ చాలా బాగా చేశారు. అయితే సూర్య వశిష్ట చేసిన ఈ పాత్రలో సిద్దు జొన్నల గడ్డను తీసుకోవాలని దర్శకనిర్మాతల అనుకున్నారు. కానీ అతను చేయనని చెప్పేసరికి ఆ అవకాశం సూర్యకి వచ్చినట్లు తెలుస్తోంది.  నిజానికి బుట్ట బొమ్మ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ చేసి ఉండి ఉంటే కచ్చితంగా ఈ సినిమా మరో లెవెల్ లో ఉండేది అంతేకాదు పక్క బ్లాక్ బాస్టర్ అందుకునేదని చెప్పవచ్చు.
ఇక సిద్దు జొన్నలగడ్డ సినిమా విషయానికి వస్తే.. గతంలో ఎన్నో సినిమాలు తీసిన డీజే టిల్లు సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చాడు. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.  కానీ ఒక్క సరైన హీరోయిన్ కూడా దొరకలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం ఇప్పటికైనా ఒక మంచి హీరోయిన్ ను  సెలెక్ట్ చేసి తర్వాత అయినా తన సినిమాను ప్రారంభిస్తాడని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: