తెలుగులో టాప్ "టిఆర్పి" రేటింగ్ తెచ్చుకున్నా డబ్బింగ్ సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటివరకు ఎన్నో డబ్బింగ్ సినిమాలు తెలుగుbలో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే కొన్ని సినిమాలు బుల్లి తెర ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించాయి. అలా ఇప్పటి వరకు విడుదల అయిన డబ్బింగ్ సినిమాలలో తెలుగు లో అత్యధిక "పి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకున్న టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
రోబో : సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో సినిమా తెలుగు లో 19.04 "టి ఆర్ పి" రేటింగ్ సొంతం చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
బిచ్చగాడు : విజయ్ ఆంటోనీ హీరోగా శశి దర్శకత్వంలో రూపొందిన బిచ్చగాడు సినిమా 18.76 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది.
కబాలి : సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకు అపజయం ఎదురైనప్పటికీ బుల్లి తెరపై మాత్రం ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఈ మూవీ కి 14.52 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది.
కాంచన 3 : రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంచన 3 మూవీ కి 13.01 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది.
కాంతారా : రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతారా మూవీ కి 12.35 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఈ మూవీ లో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: