విదేశాల్లో కూడా రికార్డులు సృష్టిస్తున్న పఠాన్?

Purushottham Vinay
ఇక ఇప్పటి దాకా ఇండియాలో బాక్స్ ఆఫీస్ ని ఊచకోత కూయిస్తున్న ఇంకా మొదటి రోజు వంద కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాలు కనుక చూసుకున్నట్లయితే బాహుబలి 2 కేజీఎఫ్ చాప్టర్ 2 ఆర్ఆర్ఆర్, ఇంకా పఠాన్ సినిమాలు ఉండటం విశేషం.ఈ నాలుగు సినిమాలు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు పఠాన్ సినిమా హవా కూడా బాలీవుడ్ లో మొదలవుతుంది. షారుఖ్ ఖాన్ నుంచి 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ మూవీ  భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ ప్రేక్షకులకి నచ్చే స్పై థ్రిల్లర్ కథ కావడంతో అక్కడి జనాలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.ఇక దీంతో మొదటి రోజు నుంచి రికార్డ్ స్థాయిలో పఠాన్ సినిమాకి కలెక్షన్స్ వస్తూ ఉండటం బాలీవుడ్ కి ఊరట కలిగిస్తుంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా దాదాపు 800 కోట్ల దగ్గరకి సమీపించినట్లు తెలుస్తుంది.కచ్చితంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వెయ్యి కోట్లు అందుకునే సినిమాగా ఈ మూవీ నిలుస్తుందని బాలీవుడ్ ప్రేక్షకులు భావిస్తున్నారు.


దంగల్ సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ మూవీగా పఠాన్ మూవీ నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది.ఇక ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఇక తాజాగా ఆస్ట్రేలియాలో బాహుబలి 2 సినిమా తరువాత ఎక్కువ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సెట్ చేస్తే.. న్యూజిలాండ్ లో ఏకంగా 1 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది.బాలీవుడ్ లో ఫస్ట్ వీక్ హైయెస్ట్ కలెక్షన్ చేసిన సినిమాల జాబితాలో గతంలో బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు ఉండేవి. అయితే వాటిని వెనక్కి నెట్టి ఇప్పుడు పఠాన్ సినిమా ఏకంగా 351 కోట్ల కలెక్షన్స్ తో మొదటి స్థానంలో ఉండటం గొప్ప విశేషం.ఇక రెండో స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా 268.63 కలెక్షన్స్ తో రెండో స్థానంలో బాహుబలి 2 మొత్తం 247 కలెక్షన్స్ తో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ మూవీ 229.16 కలెక్షన్స్ తో నిలవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: