మళ్ళీ తల్లి కాబోతున్న యాంకర్ అనసూయ..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో మొదట చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ యాంకర్ గా మారింది అనసూయ. ఎప్పుడైతే అనసూయ యాంకర్ గా జబర్దస్త్ లోకి అడుగుపెట్టిందో అప్పటినుండి ఆమె దశతిరిగిపోయింది. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది. అంతేకాదు ప్రస్తుతం టాప్ యాంకర్ లిస్టులో అనసూయ పేరు కూడా ఉంటుంది. ఇక అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ జబర్దస్త్ ద్వారా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో నటించే అవకాశాలను సైతం దక్కించుకుంది. మొదట ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మంచి గుర్తింపును పొందింది. 

దాని అనంతరం పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమాలో విలన్ క్యారెక్టర్ లో అందరినీ ఆకట్టుకుంది అనసూయ. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు ప్రధాన పాత్రలో నటిస్తూ దూసుకుపోతోంది యాంకర్ అనసూయ. అయితే ప్రస్తుతం అనసూయ వరుస సినిమాను చేస్తూ బిజీగా ఉన్న నేపథ్యంలో జబర్దస్త్ అనసూయ మళ్లీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రెగ్నెంట్ అంటే నిజంగా తను ప్రెగ్నెంట్ కాదు... అయితే అది కేవలం సినిమాలో మాత్రమే.. ప్రస్తుతం అనసూయ రంగమార్తాండ అని సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో అనసూయతో పాటు రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు రాజశేఖర్ కూతురు శివాత్మిక అనసూయ బ్రహ్మానందం కూడా కొన్ని కీలకపాత్రలో నటిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో అనసూయ గర్భవతిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  ఇక ఈ సినిమాలో అనసూయ దేవదాసి పాత్రలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలోని తన పాత్రకి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు రావడంతో అనసూయ మళ్లీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: