నిఖిల్ స్పై మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్..!

Divya
గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీ దక్కించుకున్నాడు నిఖిల్. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరిని అబ్బురపరిచింది. ఈ సినిమాతో నిఖిల్ కి పాన్ ఇండియా మార్కెట్ కూడా క్రియేట్ అయిందని చెప్పవచ్చు. దీంతో ఈ హీరో తదుపరి సినిమాలపై భారీ హైప్ నెలకొనడం గమనార్హం.
ఈ క్రమంలోనే 18పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన నిఖిల్ ఇప్పుడు స్పై మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు నిర్మాతలు.  ఇదిలా ఉండగా ఇప్పుడు హీరో నిఖిల్ స్పై మూవీ గురించి ఒక వార్త అఫీషియల్ గా లీక్ అయినట్లు తెలుస్తోంది. నేషనల్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కి అన్ని భాషలలో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా లీక్ చేసిన ఫోటోలలో నిఖిల్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
గూడచారి,  క్షణం, హిట్ 1,2 , ఎవరు వంటి సినిమాలకు ఎడిటర్ గా,  అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన.. గర్రి బిహెచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  గత ఏడాది సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా.. ఈ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.. ఈ మూవీలో నిఖిల్ కి జోడిగా ఐశ్వర్య మీనన్ నటిస్తుండగా.. ఈడి ఎంటర్టైన్మెంట్ పతాకంపై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. మొత్తానికి అయితే ఈ సినిమా నిఖిల్ సిద్ధార్థ కు మరో సక్సెస్ ను  అందించేలా కనిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: