దసరా టీజర్ పై పొగడ్తల వర్షం కురిపించిన రాజమౌళి..!!

murali krishna
పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా దసరా (Dasara )ఈ సినిమాలో నాని తనలోని పూర్తి మాస్‌ యాంగిల్ చూపించబోతున్నాడని టీజర్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది.

తాజాగా ఈ టీజర్‌పై పాన్‌ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి (Rajamouli) ప్రశంసలు ను కురిపించాడు.
న్యాచురల్ స్టార్‌ నాని (Nani) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దసరా (Dasara). పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.. నాని తనలోని ఊర మాస్‌ యాంగిల్ చూపించబోతున్నాడని తెలుస్తుంది.. తాజాగా ఈ టీజర్‌పై పాన్‌ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిన ఎస్‌ఎస్‌ రాజమౌళి (Rajamouli) తనదైన స్టైల్‌లో  అభినందనలు తెలిపారు.

‘దసరా విజువల్స్ చాలా చాలా బాగున్నాయి. నాని మాస్‌ లుక్‌ మేకోవర్‌ చాలా కొత్త గా ఉంది. కొత్త దర్శకుడు వంశీ ఇలాంటి ప్రభావాన్ని చూపించడం చాలా అద్బుతంగా ఉంది. చివరి షాట్‌ అయితే ఊర మాస్.. శ్రీకాంత్‌ ఓదెల అండ్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌‘ అని కామెంట్ చేశారు రాజమౌళి.

తెలంగాణలోని బొగ్గు గని బ్యాక్‌డ్రాప్‌ విలేజ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోందని తెలుస్తుంది.డైలాగ్ కింగ్‌ అయిన సాయికుమార్ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనుండగా.. సముద్రఖని మరియు జరీనా వహబ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నార ట.

దసరా చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారని తెలుస్తుంది . ఈ చిత్రానిక ఇసంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ధూమ్‌ ధాం దోస్తాన్‌ పాట నెట్టింట ప్రభంజనం సృష్టిస్తుంది.. దసరా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని సమాచారం.

నాని మరియు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈగ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే...ఆ సినిమాలో నాని కనిపించేది కొద్దీ సేపు అయిన చాలా నేచరల్ గా చేసాడు. రాజమౌళి నాని కాంబో లో పూర్తి సినిమా రావాలని నాని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి చూడాలి ఆ కోరిక నెరవేరుతుందో లేదో మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: