సమంత అందానికి ఎవ్వరైనా స్టన్ అవ్వాల్సిందే?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం అనే సినిమా చేస్తుంది. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించాడు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 17 వ తేదీవ  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో సమంతని శకుంతలగా చూపించేందుకు గుణ శేఖర్ చాలా రకాలుగా కష్టపడ్డారు. ప్రతీ ఫ్రేమ్ లో కూడా ఆమెను అందంగా ఇంకా చాలా గొప్పగా చూపించేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను కూడా ఆయన తీసుకున్నారు. పౌరాణిక ప్రేమగాథలో ఒరిజినాలిటీ ఉండేందుకు ఈ సినిమాకి ఒరిజినల్ నగలనే వాడారట చిత్రబృందం. మొత్తం 3 కోట్ల రూపాయల విలువ చేసే నగలను సామ్ కి వేసి శకుంతలలా కళ్ళకు కట్టినట్లు చూపించారు.


వసుంధర డైమండ్ రూఫ్ వాళ్లకు సంబంధించిన నగలను ఈ సినిమాలో సామ్ కి వాడారు.ఇక ఈ నగల వల్ల సమంత మరింత అందంగా కనిపించింది. ముఖ్యంగా సమంత కట్టుబొట్టు అయితే అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో ఆమె నగలు చీరనే ప్రత్యేకం. సమంతకు స్టైలిస్ట్ గా నీతా లల్లూ వ్యవహరించారు. అలాగే ఈ సినిమా కోసం వాడిన నగలను కూడా నేహా అనుమోలు డిజైన్ చేశారు. యువరాణిగా సమంత మెరిసిపోయేలా కనిపించేందుకు నిజమైన నగలను వాడి దెబ్బకు అందరిలో చెరగని ముద్ర వేశారు. అంతే కాదు సమంత కట్టుకున్న చీరలో కూడా ఒరిజినల్ ముత్యాలను పొదిగారట.ఆ చీర బరువు ఏకంగా 30 కిలోల దాకా ఉంటుందని సమాచారం. ఇంత బరువు ఉన్న చీరతో సమంత ఏడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొందట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా  తెరకెక్కించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాని నిర్మించారు. త్రీడీ టెక్నాలజీతో విజువల్ వండర్ గా గుణ శేఖర్ ఈ సినిమాని రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: