ఓబుల్ రెడ్డి పాత్రను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా...?

murali krishna
మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసిన మాస్ గుర్తింపు రాలేదు.ఆయన చేసిన సినిమాలలో మురారీ తప్ప పెద్ద హిట్ మూవీ అయితే లేదు.దీంతో ఒక మాస్ సినిమా తీయాలి అని కృష్ణ గారు అనుకొని గుణశేఖర్ దగ్గర ఉన్న కథ విన్నారట.ఆ కథ నచ్చి కృష్ణ గారు  గుణశేఖర్ కి ఛాన్స్ ఇచ్చారని సమాచారం.

అలా వచ్చిన ఒక్కడు సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది.ఈ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ప్రకాష్ రాజ్ పాత్ర ఒక ఎత్తు.ఈ సినిమాలో ఓబుల్ రెడ్డి గా ప్రకాష్ రాజ్ ఎంత అద్భుతంగా నటించాడో మనందరికీ తెలుసు...ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కి కొత్త వెరిషయన్ ఇచ్చారనే చెప్పవచ్చు అయితే ఈ సినిమా లో విలన్ గా ముందు గుణశేఖర్ గోపిచంద్ ని అనుకున్నారని సమాచారం.కానీ గోపిచంద్ ఆ క్యారెక్టర్ నేను అస్సలు చేయలేను అని చెప్పడంతో ఆ క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ నీ తీసుకున్నారట.నిజం గా ప్రకాష్ రాజ్ ఆ క్యారక్టర్ కి తన నటన తో ప్రాణం పోశారనే చెప్పవచ్చు..అయితే గోపిచంద్ ఈ సినిమా వదిలేయడానికి ఒక కారణం కూడా ఉంది ఏంటంటే అప్పటికే గోపిచంద్ తేజ డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న నిజం సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.మళ్ళీ మహేష్ బాబు సినిమాలో విలన్ గా చేస్తే బాగా రొటీన్ అయిపోతుంది అనే కారణంతో తను ఈ క్యారెక్టర్ నేను చేయలేను అని చెప్పినట్లు సమాచారం.... ఆ తర్వాత గోపిచంద్ వర్షం సినిమాలో విలన్ గా చేసి యజ్ఞం సినిమాతో కథనాయకుడు అయ్యాడు...మొత్తానికి గోపిచంద్ చేయాల్సిన క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ చేసి ఆ పాత్రకి కొత్త షేడ్స్ ను తీసుకువచ్చాడు అనే చెప్పవచ్చు...ఈ సినిమా లోనే కాకుండా ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తో పోకిరి సినిమా లో కూడా విలన్ ఆలీ భాయ్ గా అద్భుతంగా నటించాడు.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఒక సినిమాను చేస్తున్నాడు.ఒక్కడు సినిమా డైరెక్టర్ అయిన గుణశేఖర్ సమంత తో శాకుంతలం అనే సినిమా విడుదల కు సిద్ధం చేసాడు.07:06 PM

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: