ఆల్ ఐస్ ఆన్ అనసూయ..!

shami
స్మాల్ స్క్రీన్ యాంకర్ అనసూయ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారింది. వరుస సినిమా ఛాన్స్ లు రావడంతో తనకు ఇంత క్రేజ్ తెచ్చిన జబర్దస్త్ ను కూడా వదులుకుంది అమ్మడు. ప్రస్తుతం అనసూయ చేతి లో బాగానే సినిమాలు ఉన్నాయి. జబర్దస్త్ వల్ల తన రెగ్యులర్ ఆడియన్స్ కు దూరమైన అనసూయ ఫోటో షూట్స్ చేస్తూ ఫన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని అలరిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు తన ఫోటో షూట్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ట్రెండీ మోడ్రెన్ డ్రెస్ తో అనసూయ ఎట్రాక్ట్ చేస్తుంది.
యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను తన అందాల తో అలరిస్తూ వచ్చిన అనసూయ గ్లామర్ ట్రీట్ లో కూడా తగ్గనంటుంది. పెళ్లై పిల్లలు ఉన్నా సరే ఆమె చేస్తున్న హాట్ షోకి సూపర్ క్రేజ్ తెస్తుంది. అనసూయ ఫోటో షూట్ అంటే సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్. అనసూయ చేస్తున్న ఈ షో తనకు ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. పుష్పలో దాక్షాయణిగా చేస్తున్న అనసూయ రంగమార్తాండ సినిమాలో కూడా నటిస్తుంది. వేరే సినిమాలు కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో అనసూయ చేస్తుంది.
సినిమాలు, ఫోటో షూట్స్ ఇలా కెరీర్ ఫుల్ బిజీగా నడిపిస్తుంది అనసూయ. జబర్దస్త్ మానేసి తప్పు పనిచేసింది అనిపించినా వరుస సినిమాలు ఆమెను క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయని తెలుస్తుంది. క్రిష్ తో ఒక క్రేజీ వెబ్ సీరీస్ కూడా చేస్తుందట అనసూయ అందులో ఆమె వేశ్య పాత్ర లో కనిపించనుందట. అనసూయ చేస్తున్న ఈ ప్రయోగాలు ఆమెకు ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చిపెడుతున్నాయని చెప్పొచ్చు. యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన అనసూయ తన మార్క్ చూపిస్తూ  సత్తా చాటాలని చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: