మాట నిలుపుకోలేకపోయిన శర్వానంద్ !

Seetha Sailaja
ఈమధ్యకాలంలో టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నితిన్ నిఖిల్ ల పెళ్ళిళ్ళు ఇప్పటికే అయిపోయాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి 38 సంవత్సరాల శర్వానంద్ కూడ చేరిపోయాడు. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో శర్వానంద్ ను పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తే ప్రభాస్ పెళ్ళి చేసుకున్న తరువాత మాత్రమే తన పెళ్ళి ఉంటుందని చెప్పాడు.

అయితే ఇప్పుడు శర్వానంద్ కూడ పెళ్ళి చేసుకుంటూ ఉండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మచారుల లిస్టు తగ్గిపోతోంది. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు రక్షితా రెడ్డిని శర్వానంద్ పెళ్లాడబోతున్నాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆమె వివరాలు ఇంతకు మించి తెలియవు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అన్న మాటలు వినిపిస్తున్నాయి.

రాబోయే వేసవిలో వీరి పెళ్ళి ఉంటుందని టాక్. రామ్ చరణ్ రానా శర్వానంద్ ఉపాసనా వీరంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న నాటి నుండి స్నేహితులు. చిన్నతనంలో చదువులో బాగా చురుకుగా ఉండే శర్వానంద్ చరణ్ హోమ్ వర్క్ ను చేసేవాడట. ఆ సాన్నిహిత్యం వీరిద్దరి మధ్య ఇప్పటికీ కొనసాగుతోంది. కెరియర్ పరంగా శర్వానంద్ కంటే రామ్ చరణ్ చాల ముందడుగులో ఉన్నప్పటికీ అవకాశం చిక్కితే చాలు వీరిద్దరూ వారికి నచ్చిన హోటల్ కు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

గత కొంతకాలంగా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న శర్వానంద్ ఆమధ్య విడుదలైన ‘ఒకేఒక జీవితం’ మూవీతో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు సినిమాలలో నటిస్తున్నప్పటికీ గత కొంతకాలంగా వస్తున్న వరస ఫ్లాప్ లతో అతడి మార్కెట్ కొంతవరకు తగ్గింది అన్న కామెంట్స్ ఉన్నాయి. మంచి నటుడుగా పేరుగాంచిన శర్వానంద్ మాస్ హీరోగా కూడ రాణించాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు పెద్దగా విజయవంతంకాలేదు. ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉన్న పరిస్థితులలో ఒక సాలిడ్ హిట్ కోసం ఈ హీరో ఎదురు చూస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: