పఠాన్: వామ్మో మొదటి రోజే 100 కోట్ల వసూళ్లు?

Purushottham Vinay
ఇక బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హిట్ కొట్టి దాదాపు 10 సంవత్సరాలు అయ్యింది. 2018 దాకా వరుస ప్లాపులతో చాలా దారుణంగా షారుక్ మార్కెట్ పడిపోయింది. ఇక అంతా ఇతని పని అయిపోయిందనుకున్నారు. దాంతో షారుక్ సినిమాలు ఆపేసి 4 సంవత్సరాలు బ్రేక్ తీసుకొని మంచి కథలు వింటూ ఎట్టకేలకు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపిక పదుకొణే నటించింది.బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ చిత్రం .. బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ ను తట్టుకున్న  మొదటి రోజే బాక్సాఫీస్ ని షేక్ చేసి  వసూళ్ల సునామీ సృష్టించింది. మొదటి రోజే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. దాంతో తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడ్‌ సినిమా గా ఈ సినిమా రికార్డు సృష్టించింది.


ఇండియన్ మార్కెట్ లోనే ఏకంగా రూ. 67 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక విదేశాల్లో అయితే మొత్తం రూ. 35 కోట్ల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.మొత్తంగా కేవలం ఒక్కరోజే ఏకంగా రూ. 102 కోట్లు వసూలు చేసింది. కన్నడ హీరో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ -2 తొలి రోజు 53. 9 కోట్ల కలెక్షన్స్ తో అంతకముందు రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును పఠాన్ సినిమా సునాయాసంగా బద్దలు కొట్టింది. మొత్తానికి షారుక్ ఖాన్ తన పని అయిపోలేదని ది కింగ్ ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ముఖ్యమైన రోల్ లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఇక చూడాలి మున్ముందు రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. మొత్తానికి బాలీవుడ్ కి మళ్ళీ ప్రాణం పోశాడు కింగ్ ఖాన్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: