గంగూలీ బయోపిక్.. హీరో ఎవరో తెలుసా?

praveen
క్రికెట్ ఊపిరిగా బ్రతికి.. భారత జట్టులో ఒక కీలక ఆటగాడిగా మాత్రమే కాదు.. ఇక భారత కెప్టెన్ గా కూడా జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు సౌరబ్ గంగూలీ. భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజా ఆటగాళ్లలో ఇక ఎప్పుడు సౌరబ్ గంగూలీ కూడా ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత జట్టుకు దాదాపు దశాబ్ద కాలం పైగానే సేవలు అందించిన సౌరబ్ గంగూలీ మొన్నటి వరకు అటు బీసీసీఐ అధ్యక్షుడిగా అత్యున్నత పదవిలో కూడా కొనసాగారు.

 ఇక అంతకుముందు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నో రోజులపాటు బాధ్యతలు నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. ఇలా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఇంకా క్రికెట్ కి ఎంతో దగ్గరగానే ఉంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు సౌరబ్ గంగూలీ. అయితే ఇటీవల కాలంలో ఇలా భారత క్రికెట్లో లెజెండ్స్ గా కొనసాగుతున్న వారి జీవిత కథ ఆధారంగా సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టడం లాంటివి చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే సౌరబ్ గంగూలీ బయోపిక్ కూడా తెరకెక్కబోతుంది అన్నది తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు లవ్ రంజాన్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

 నిర్మాత లవ్ రంజాన్ తో పాటు తాను కూడా చాలా బిజీగా ఉండడంతో ఇక స్క్రిప్ట్ పనులకు కొన్నాళ్లపాటు అంతరాయం ఏర్పడిందంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు మాత్రం స్క్రిప్ట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయని ఇక స్క్రిప్ట్ పూర్తయిందని ఇక ప్రొడక్షన్ హౌస్ తో దీనికి సంబంధించి చర్చలు జరపాల్సి ఉంది అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక సౌరబ్ గంగూలీ బయోపిక్ లో లెజెండరీ క్రికెటర్ పాత్రను రన్ బీర్ కపూర్ పోషిస్తాడు అని గతంలో వార్తలు వచ్చాయి. ఇక సౌరబ్ గంగూలీ సైతం ఆ హీరో తన పాత్ర చేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాడట.అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా పూర్తి అప్డేట్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: