మొదటి రోజే ప్రభంజనం సృష్టించిన పఠాన్..!

Divya
యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై.. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం పఠాన్.. యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తో పాటు పలువురు భారీ తారాగణం ఈ సినిమాలో పాలు పంచుకోవడం జరిగింది. నిజానికి ఈ సినిమా జనవరి 25వ తేదీన విడుదల అయి.. మొదటి రోజే ప్రభంజనం సృష్టించిందని చెప్పవచ్చు . సినిమా విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్ పేరిట ఐదు లక్షలకు పైగా బుకింగ్స్ జరిగి బాలీవుడ్ కి ఊపిరి అందించింది.
సినిమాపై మొదట్లో విమర్శలు,  బాయ్ కాట్ అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగినప్పటికీ.. సెన్సార్ బోర్డు సహాయంతో కొన్ని సన్నివేశాలు తొలగించి సినిమాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  అలా ఎట్టకేలకు జనవరి 25వ తేదీన తెలుగు,  తమిళ్ , మలయాళం తో పాటు హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మొన్నటికి మొన్న ఒక యువకుడు కూడా తనకు పఠాన్ సినిమా టికెట్ ఇప్పించకపోతే తాను సూసైడ్ చేసుకుంటాను అని కూడా ఒక వీడియో వైరల్ చేసిన విషయం తెలిసిందే . దీన్ని బట్టి చూస్తే దాదాపు నాలుగు సంవత్సరాలు తర్వాత మళ్లీ తెరపైకి అలరించడానికి వస్తున్న షారుక్ ఖాన్ అంటే అభిమానులలో ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా పఠాన్ మూవీ రాబట్టిన కలెక్షన్స్ చూస్తే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మళ్లీ పునరాగమనం అయ్యాడు అని తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే ₹50కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధించడంతో సినిమా పటిష్టంగా ముందుకు సాగుతోందని చెప్పవచ్చు.  మొదటి రోజే ఇన్ని కోట్ల కలెక్షన్ అంటే ఇక వారాంతం ముగిసేసరికి రికార్డులు కొల్లగొడుతుందని పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఏది ఏమైనా పఠాన్ సినిమా బాలీవుడ్ కి ఊపిరి పోసిందని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: