యాక్సిడెంట్ తర్వాత మొదటి ట్వీట్ పంచుకున్న విజయ్ ఆంటోని..!

Divya
బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కు గురైన విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అంటూ రకరకాల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న అనుమానాలు.. రూమర్లకు తెర దించుతూ మొదటి ట్వీట్ చేశాడు విజయ్ ఆంటోనీ. అందులో తన హెల్త్ కండిషన్ పై కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది.. విజయ్ ఆంటోనీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. "డియర్ ఫ్రెండ్స్ మలేషియాలో బిచ్చగాడు 2 షూటింగ్ చేస్తున్న సమయంలో నేను ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఆ సంఘటనలో నా ముక్కు, దవడకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.
ప్రస్తుతం నేను వాటి నుంచి సురక్షితంగా కోలుకున్నాను చిన్న మేజర్ సర్జరీ కూడా పూర్తయింది. త్వరలోనే పూర్తిగా రికవరీ అయ్యి మీ అందరి ముందుకు వస్తాను.. మీతో మాట్లాడుతాను.. కఠిన సమయంలో కూడా నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ తన ట్వీట్ ట్ ద్వారా తెలిపారు విజయ్. థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. సర్జరీ జరిగిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఈ ఫోటోలు తీసి పంపినట్లు తెలుస్తోంది. ఇది చూసిన విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగానే కోలుకుంటున్నాడు అని తెలిసి వారి ఆనందానికి అవధులు లేవు.
త్వరలోనే విజయ్ ఆంటోనీని తెరపై చూడాలనుకుంటున్నామంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ గా.. డైరెక్టర్ గా,  నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తెలుగులో బిచ్చగాడు మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు రవితేజ దరువు , శ్రీకాంత్ మహాత్మా సినిమాలకు స్వరాలు సమకూర్చి నకిలీ , సలీం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.. అమ్మ సెంటిమెంటుతో  బిచ్చగాడు సినిమాతో ప్రేక్షకులను పలకరించి మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు.  అందుకే విజయ్ ఆంటోనీకి ప్రమాదం జరిగిందని తెలియగానే ఒక కోలీవుడ్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: