తనపై జరిగిన క్యాస్టింగ్ కౌచ్ గురించి వ్యాఖ్యలు చేసిన లేడీ సూపర్ స్టార్....!!

murali krishna
ఏ సినిమా ఇండస్ట్రీలోకి  ఐనా సరే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి స్థిరపడాలి అంటే వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇలా ఎంతోమంది నటీమణులు కెరియర్ మొదట్లోనే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్న సంఘటనల గురించి ఇదివరకే చాలా సందర్భాలలో తెలియచేశారు.
అలాగే కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాదని ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ ఇబ్బందులు మహిళలకు ఎదురవుతూనే ఉన్నాయని అయితే మన వ్యవహార శైలి మన ప్రవర్తన బట్టి ఈ ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయని చెప్పు కొచ్చారు.ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన  నయనతార గురించి అందరికీ సుపరిచితమే.దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతార గా కొనసాగుతూ సౌత్ ఇండస్ట్రీ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీమణి గా పేరు సంపాదించింది.పెళ్లయినప్పటి కీ ఆమె వరుస సినిమా లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీ లో చాలా బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ముఖ ముఖి సంభాషణ లో పాల్గొన్నటువంటి నయనతార ఇండస్ట్రీ లో ఉన్నటు వంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు.ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అనే విషయం గురించి తాను మాట్లాడనని అయితే మన ప్రవర్తన బట్టి మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని ఈమె చెప్పారు.తాను ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో తనని కూడా చాలా మంది కమిట్మెంట్ అడిగారని అయితే నాకు ఇష్టం లేదని నిర్మొహమాటం గా చెప్పానని నయనతార చెప్పుకొచ్చారు.
ఐతే నేను కేవలం నా టాలెంట్ నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చాను.నా టాలెంట్ తోనే ప్రస్తుతం నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని అంటూ ఈ సందర్భంగా నయనతార క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ఇపుడు బాగా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: