సాయి పల్లవి సినిమాలు చేస్తుంది అందుకేనా...?

murali krishna
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా కానీ వాళ్ళందరిలో జనాలకి నచ్చిన బ్యూటీని మనస్సు లో పెట్టుకుంటారు . ఆ బ్యూటీ సినిమాలు హిట్ కాకపోయినా కానీ ఆ హీరోయిన్ ను ఆరాధిస్తారు.

ఆ లిస్ట్ లో ఎప్పుడూ ముందు ఉంటుంది సాయి పల్లవి . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అయితే అవసరం లేదు . డాక్టర్ చదువుకున్న సాయి పల్లవి ఎవ్వరూ ఊహించిన విధంగా మలర్ అనే సినిమాతో  చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టింది.

అయితే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ఫిదా సినిమా తో తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ను కూడా వేయించుకొని ఇప్పుడు ఇండస్ట్రీలోని వన్ అఫ్ ది టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది.నిజాని కి సాయి పల్లవి నటించిన సినిమాలు హిట్ కొట్టింది కూడా చాలా తక్కువ . కానీ నటించిన ప్రతి సినిమాలో  కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

మిగతా హీరోయిన్లందరూ రెమ్యూనరేషన్ కోసం పాపులారిటీ కోసం సినిమాలు చేస్తుంటే .. సాయి పల్లవి మాత్రం తన ఆనందం కోసం నటన పై తనకున్న ఇంట్రెస్ట్ కారణంగా నే సినిమాలు తీస్తుంది . ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది జనాలు కచ్చితంగా చెప్పుకొచ్చారు . సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేష న్ తిరిగి ఇచ్చేయడం అదే సాయి పల్లవి లోని గొప్పగుణం . అదే మిగతా హీరోయిన్లు కాల్ షీట్స్ బుక్ చేసుకునే ముందే రెమ్యూనరేషన్ పక్కా గా డిమాండ్ చేసి అయితే తీసుకుంటారు. డబ్బు కోసమే సినిమాలు చేసే హీరోయిన్స్ ఉన్న మన ఇండస్ట్రీలో డబ్బుని అసలు కేర్ చేయని సాయి పల్లవి ఉండడం ఇండస్ట్రీకే ఎంతో గర్వకారణం అంటున్నారటా సాయి పల్లవి అభిమాను లు..04:37 PM

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: