'ఏవీఎస్' గారి అల్లుడు కూడా ప్రముఖ నటుడనే విషయం మీకు తెలుసా..?

Anilkumar
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన నటులలో అలనాటి నటులు ఏవీఎస్ గారు కూడా ఒకరు. సినిమాల్లో తనదైన డైలాగ్స్ తో మేనరిజమ్స్ తో పాత్రను ఎంతో బాగా పండించేవారు. ఇక ఏవీఎస్ గారి అసలు పేరు ఆమంచి వెంకటసుబ్బయ్య. సినిమాల్లోకి రాకముందు తెనాలిలో పౌరోహిత్యం చేసిన ఆయన.. ఆ తర్వాత కొన్నాళ్లకు విజయవాడలో ఓ విలేకర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆర్థికంగా ఎన్నో కష్టాలను అనుభవించారు. తినడానికి కనీసం తిండి కూడా లేకుండా తన ఆకలిని అదుపు చేసుకునేందుకు కిల్లి నమిలేవారట. అన్ని కష్టాలను అనుభవించిన ఏవీఎస్ గారు డబ్బుల కోసం మిమిక్రీ షోలు చేసేవారట. 

అలా మిమిక్రీ షోలు చేస్తున్న ఓ ప్రదర్శనలో దర్శకుడు బాపు ఏవీఎస్ గారు టాలెంట్ చూసి 'మిస్టర్ పెళ్ళాం' సినిమాలో అతనికి అవకాశం ఇచ్చారు. ఇక ఆ సినిమా ఏవీఎస్ గారికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టగా.. ఆ తర్వాత ఆయన మరెన్నో సినిమాల్లో సహాయక పాత్రలు చేశారు. కెరీర్లో సుమారు 750 కి పైగా సినిమాలో నటించారాయన. ముఖ్యంగా కామెడీ పాత్రల్లో ఎక్కువగా మెప్పించారు. ఘటోత్కచుడు, యమలీల, మాయలోడు, ఆవిడ మా ఆవిడే, సిసింద్రీ, జయం మనదేరా, మావిడాకులు, వెంకీ, బెండు అప్పారావు, సంక్రాంతి, శ్రీరామదాసు, రాధాగోపాలం, దేనికైనా రెడీ వంటి సినిమాలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపును అందుకున్నారు.

కేవలం నటుడు గానే కాదు దర్శకుడిగా నిర్మాతగా కూడాను తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో సైతం పని చేశారు. ఇక ఏవీఎస్ గారికి ఫ్యామిలీ విషయానికొస్తే.. ఆయనకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి ప్రదీప్, అమ్మాయి ప్రశాంతి. 2008వ సంవత్సరంలో ఏవీఎస్ గారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది.ఆ సమయంలో ఏవీఎస్ గారి కుమార్తె ప్రశాంతి ఆయనకు కాలేయాన్ని దానం చేశారు. మళ్లీ అదే వ్యాధి బారిన పడి ఆరోగ్యం దెబ్బతినడంతో 2013లో ఏవీఎస్ గారు మరణించారు. అయితే ఏవీఎస్ గారి అల్లుడు కూడా సినీ నటుడే. అతని పేరు శ్రీనివాస్ దావగుడి. ఇండస్ట్రీలో అతని చింటూ అని పిలుస్తూ ఉంటారు. ఇతను ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. ఎక్కువగా మన రవి బాబు తీసే సినిమాల్లో కనిపిస్తాడు. వాటిలో చాలావరకు గుండుతోనే కనిపించాడు. ఇక ఇప్పుడిప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. ఇక శ్రీనివాస్ ఒకప్పటి సీనియర్ నటుడైన ఏవీఎస్ గారి అల్లుడు అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: