స్టార్ హీరోల అభిమానులలో వింత పోకడలు !

Seetha Sailaja
గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు టాప్ హీరోలుగా వెలుగొందే రోజులలో సంక్రాంతికి వారి సినిమాలు విడుదలైనప్పుడు వారివారి అభిమానులు చేసే హడావిడితో ధియేటర్లు అప్పట్లోనే మారుమ్రోగిపోయేవి. ఇక తమ హీరో టాప్ అని అనిపించుకోవడానికి వీధుల పై అంటించిన పోష్టర్ల పై ఎదుటి హీరో అభిమానులు గేదె పేడను పులిమి తమ అక్కసు తీర్చుకునేవారు.

ఆతరువాత శోభన్ బాబు కృష్ణ కృష్ణంరాజుల మధ్య సంక్రాంతి సినిమాల వార్ జరుగుతున్నప్పుడు ధియేటర్ల బయట భారీ కటౌట్ లు పెట్టి వాటికి పెద్దపెద్ద దండలు వేయడమే కాకుండా పాలతో అభిషేకాలు చేసేవారు. ఈ ట్రెండ్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ సినిమాల వరకు కొనసాగింది. టాప్ యంగ్ హీరోలు జూనియర్ ప్రభాస్ చరణ్ అల్లు అర్జున్ ల హవా ప్రారంభం అయిన తరువాత అందరికీ సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో తమ హీరో గొప్ప అంటే తమ హీరో మాత్రమే గొప్ప అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ వార్ కామెంట్స్ యుద్ధం కొనసాగుతోంది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ మూవీలకు సంబంధించిన హీరోలు వేరువేరు సామాజిక వర్గాలకు సంబంధించిన వారు కావడంతో ఆ రెండు సామాజిక వర్గాలలోని యూత్ ఆ రెండు సినిమాల విజయం తమ సామాజిక వర్గ విజయంగా భావించారు అని టాక్. ఇలాంటి భావన వల్లే ఈ రెండు సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రివ్యూలు గొప్పగా లేనప్పటికీ ఈ రెండు సినిమాలు కలక్షన్స్ పరంగా ఊహించని విజయం సాధించాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అంతేకాదు కొన్ని చోట్ల అయితే ఈసినిమాల కలక్షన్స్ పడిపోకుండా ఈ ఇద్దరి హీరోల సామాజిక వర్గాలలోని ఆ హీరోల అభిమానులు తమ సొంత డబ్బుతో టిక్కెట్లు కొని సంక్రాంతి సమయంలో ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రతి షోకి హౌస్ ఫుల్ బోర్డ్ పడేలా ప్రయత్నించారు అన్న గుసగుసలు కూడ వినిపిస్తిన్నాయి. ఈ వార్తలే నిజం అయితే కొత్త వింత పోకడలు వచ్చాయి అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: