అల్లు అర్జున్ హీరోయిన్.. ఇప్పుడు రెస్టారెంట్లో పనిచేస్తుందట?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో బాగా రాణించాలి అంటే టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ ఇక ఎంత అందం ప్రేక్షకులను ఆకర్షించినప్పటికీ.. అటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి. అదే అదృష్టం లేకపోతే టాలెంట్ ఉన్నవాళ్లు కూడా ఇండస్ట్రీలో కనుమరుగు అవుతూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతో మంది హీరోల విషయంలో ఇది నిజం అయింది అని చెప్పాలి. అదే సమయంలో అడపాదడబా టాలెంట్  ఉన్నప్పటికీ ఇక్కడ నక్క తోక తొక్కి వచ్చినట్లుగానే కొంతమంది హీరోయిన్లు స్టార్లుగా ఎదుగుతూ ఉంటారు అని చెప్పాలి.

 ఇక ఇలాంటి అదృష్టం లేకనే స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న ఒక హీరోయిన్ ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో లేకుండా పోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అల్లు అర్జున్ సరసన నటించిన  షీలా. ఈ హీరోయిన్ పేరు చెబితే  ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ అల్లు అర్జున్ పరుగు సినిమాలో నటించిన హీరోయిన్ అంటే మాత్రం ప్రేక్షకులకు టక్కున గుర్తు వస్తుంది. హీరోయిన్గా ఇండస్ట్రీకి రాకముందే బాలనటిగా  25 సినిమాల్లో నటించింది. సీతాకోకచిలుక అనే సినిమా ద్వారా మొదటగా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక అటు వెంటనే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

 ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో షీలా కెరియర్ ఒక్కసారిగా టర్న్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత సినిమాల్లో కొన్ని అవకాశాలు మాత్రమే ఆమె తలుపు తట్టాయ్.  మస్కా, అదుర్స్, రాజు భాయ్, హలో ప్రేమిస్తారా లాంటి సినిమాల్లో నటించిన ఈ సినిమాలు ఆమె కెరియర్ కు ఉపయోగపడలేదు. దీంతో ఇండస్ట్రీలో కనుమరుగైపోయింది. అయితే సినిమాలు మానేయడానికి ప్రధాన కారణం షీలా క్యాన్సర్ బారిన పడటమే అన్న టాక్ కూడా ఉంది. కాగా కేరళకు చెందిన బిజినెస్ మాన్ సంతోష్ రెడ్డిని పెళ్లి చేసుకుని చెన్నైలోనే తన ఫ్యామిలీతో సెటిల్ అయింది షీలా. ప్రస్తుతం ఒక సూపర్ మార్కెట్ ను రన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: