శ్రీ లీలా కారణంగా ఇబ్బంది పడుతున్న స్టార్ హీరోయిన్స్..!

Divya
కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. కే రాఘవేంద్రరావు దశకత్వంలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు తెర కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన నటనతో , అందంతో భారీ పాపులారిటీ దక్కించుకున్న శ్రీ లీలా ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా మారిందని చెప్పాలి. ఇటీవల రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని సొంతం చేసుకొని ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ప్రస్తుతం ఈమె చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉండడం గమనార్హం. అందులో అన్నీ కూడా పెద్దపెద్ద హీరోల సినిమాలే కావడం గమనించదగ్గ విషయం అని చెప్పవచ్చు. ఇప్పుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న #SSMB 28 లో పూజా హెగ్డే తో పాటు సెకండ్ హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకున్న శ్రీ లీలా మరోవైపు బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా బాలకృష్ణకు కూతురు పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నలిచ్చింది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా శ్రీ లీలా క్రేజ్ కారణంగా మిగతా స్టార్ హీరోయిన్లు కూడా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్టార్ హీరోలందరి సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న శ్రీ లీలా పారితోషకం కూడా పెద్దగా డిమాండ్ చేయడం లేదు.  అందుకే ఈమె క్రేజ్  ను బట్టి అలాగే  పెద్దగా పారితోషకం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నిర్మాతలు ఎక్కువగా ఈమెను సంప్రదిస్తున్నారు.  ఈ నేపథ్యంలోని మిగతా స్టార్ హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో పెంచకుండా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా శ్రీ లీలా క్రేజ్ మిగతా హీరోయిన్లకు ఇబ్బందిని కలిగిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: