మరోసారి ఆదర్శకుడి మూవీలో నటించనున్న దలపతి విజయ్..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  ఇది ఇలా ఉంటే విజయ్ తాజాగా వారిసు అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. తమిళంలో రూపొందిన ఈ మూవీని వారసుడు అనే పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా , రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

తమన్ సంగీతం అందించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించగా , శ్రీకాంత్ ఈ సినిమాలో విజయ్ కి సోదరుడి పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందబోయే మూవీలో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీలో విజయ్ సరసన అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష జోడిగా కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో విజయ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విజయ్ కెరియర్ లో 67 వ మూవీగా రుపొందబోతుంది.

ఇది ఇలా ఉంటే విజయ్ తన 68 వ మూవీకి కూడా దర్శకుడిని ఇప్పటికే కన్ఫామ్ చేసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే ... తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో విజయ్ తన 68 వ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్లో తేరి ... మెర్సిల్ ... బిగిల్ మూవీలు తెరకెక్కాయి. ఈ మూడు మూవీలు కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు అట్లీ ... షారుక్ ఖాన్ హీరోగా రూపొందుతున్న జవాన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: