తెగింపు మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ తాజాగా తమిళ్ లో రూపొందినటు వంటి తునివు అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. హెచ్ వినోద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , మంజు వారియర్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని తెలుగు లో తెగింపు పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాను తమిళ్ మరియు తెలుగు భాషల్లో జనవరి 11 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. 
ఇప్పటివరకు ఈ సినిమా 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ లో తెగింపు మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.18 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,  రెండవ రోజు 40 లక్షల కలెక్షన్ లను ,  మూడవ రోజు 18 లక్షల కలెక్షన్ లను ,  నాలుగవ రోజు 21 లక్షల కలెక్షన్ లను ,  5 వ రోజు 27 లక్షల కలెక్షన్ లను ,  ఆరవ రోజు 24 లక్షల కలెక్షన్ లను ,  ఏడవ రోజు 18 లక్షల కలెక్షన్ లను ,  ఎనిమిదవ రోజు 12 లక్షల కనెక్షన్ లను ,  9 వ రోజు 8 లక్షల కలెక్షన్ లను ,  పదవరోజు 6 లక్షల కలెక్షన్ లను ,  11 వ రోజు 6 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తం మీద ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో 2.03 కోట్ల షేర్ ,  3.98 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.  అజిత్ కొంత కాలం క్రితం వలిమై మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కాకపోతే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: