రెడ్ దుస్తులలో మైమరిపిస్తున్న తమన్నా అందాలు..!!

Divya
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్గా తమన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికే 15 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఇన్నేళ్ల కెరియర్ లో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తమన్నా స్టార్ హీరోల అందరితో కూడా నటించింది. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయస్గా తమన్నా మారిపోయింది. ఒకవైపు చిరంజీవికి జోడిగా భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.మరొకవైపు రజినీకాంత్ జైలర్ సినిమాలో కూడా నటించబోతోంది. ఇక ఈ రెండు సినిమాల పైన గట్టి హోప్స్ పెట్టుకుంది తమన్నా. మరొకవైపు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

వీటితోపాటు తమన్నా లీడర్లు మరికొన్ని సినిమాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇప్పటికీ తమన్నా అందంతో నటనతో డాన్స్ తో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటోంది. బాహుబలి సినిమాతో మరింత అందంతో మెస్మరైజ్ చేసిన తమన్నా మరొకసారి మ్యాగజైన్ కవర్ పేజీ పైన హాట్ లుక్ లో మైమరిపించేలా చేస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ఫస్ట్ లుక్ కవర్ పేజీ పైన తమన్నా హాట్ లుక్స్ లో దర్శనమిచ్చింది.
ఇంస్టాగ్రామ్ లో తమన్నా ఈ ఫోటోను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోకు నేటిజెన్లు సైతం పలు రకాలుగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా తమన్న అర్థం చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. తమన్నా ఈ ఫోటోని షేర్ చేసి 30 నిమిషాలు లోపే 40 వేల మందిపైగా వీక్షించడం జరిగిందట. ప్రస్తుతం తమన్నకు సంబంధించి ఈ ఫస్ట్ లుక్ కవర్ పేజీ ఫోటో వైరల్ గా మారుతోంది. ఇక తమన్నా కూడా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లుగా గడిచిన కొద్దిరోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు ఇమే క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: