అక్కినేని అఖిల్ పై మనసుపడ్డ పెళ్ళైన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖిల్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చాడు అఖిల్. కానీ మొదటి సినిమాతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. దాని అనంతరం హీరోగా రెండు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.గతేడాది వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కాస్త పేరు తెచ్చుకున్నాడు. సినిమాల విషయం పక్కనపెడితే అఖిల్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఆయన హ్యాండ్సమ్ లుక్ చూసి అమ్మాయిలు అఖిల్ ని చూసేందుకు క్యూ కడుతూ ఉంటారు. అంతేకాదు అఖిల్ అమ్మాయిలు కలలు రాకుమారుడు గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తండ్రి మన్మధుడి లాగా ఎంత పేరు తెచ్చుకున్నాడో కొడుకు కూడా అలాగే అమ్మాయిల కలల రాకుమారుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఇలాంటి యంగ్ హీరో అఖిల్ నీ ఒక పెళ్లయిన అమ్మాయి ఇష్టపడుతోంది. అయితే ఆ హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో రకాల డాన్స్ షోలో వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ షో త్వరలోనే ముగుస్తుంది.

ఈ నేపథ్యంలోనే జనవరి 22న ఈ షో ఫినాలే కి సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది. అయితే ఈ షోలో గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు తన కూతురు సితార కలిసి వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోని తాజాగా గ్రాండ్ ఫినాలే కోసం చీఫ్ గెస్ట్ గా ఈ షో కి అక్కినేని అఖిల్ వస్తున్నట్లు తాజాగా ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. అయితే ఆ షోలో జడ్జిగా హీరోయిన్ ఆనంది పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే అఖిల్ ని చూసి మొదటి చూపుల్లోనే ఫిదా అయింది ఈ బ్యూటీ. అంతేకాదు అక్కినేని అఖిల్ ని చూసి అనవసరంగా నేను తొందరగా పెళ్లి చేసుకున్నాను అంటూ బాధపడింది. ఈ విషయాన్ని నేరుగా అఖిల్ తో చెప్పడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వేరులవుతుంది. అంతేకాదు ఆమె చెప్పిన మాటలకి హీరో అఖిల్ కూడా సిగ్గుపడతాడు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: