"కస్టడీ" మూవీ నుండి కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయిన ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కృతి "ఉప్పెన" మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , మొట్ట మొదటి మూవీ తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని , అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక సినిమా అవకాశాలను దక్కించుకుంది.

అందులో భాగంగా కృతి కొన్ని విజయాలను , కొన్ని అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో మంచి జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. పోయిన సంవత్సరం కృతి ఏకంగా నాలుగు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది . అందులో బంగార్రాజు మూవీ మంచి విజయం సాధించగా ది వారియర్ ..  మాచర్ల నియోజకవర్గం ... ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్నాయి .
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి ... నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న కస్టడీ మూవీలో హీరోయిన్ గ నటిస్తోంది. ఈ సినిమాకు ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తూ ఉండగా , అరవింద స్వామి ... ప్రియమణి ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా నుండి కృతి శెట్టి కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కృతి సంకెళ్ల వెనకాల నిలబడి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: