ఈసారి సంక్రాంతికి అదరగొట్టిన శృతిహాసన్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు అయినటువంటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తమిళ మూవీల ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి గబ్బర్ సింగ్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగింది .

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శృతి హాసన్ ఎక్కువ శాతం సీనియర్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సిం హారెడ్డి మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా ఒక రోజు తేడాలోనే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల అయ్యాయి.

ఈ రెండు మూవీలపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ మూవీ లలో శృతి హాసన్ పాత్ర తక్కువే అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ లు అద్భుతమైన రేంజ్ లో కలెక్షన్ లను రాబడుతూ ప్రేక్షకుల ఆదరణను పొందుతూ ఉండడంతో శృతి హాసన్ కు ఈ సంక్రాంతి బాగా కలిసి వచ్చింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: