లుక్ మార్చేసిన మహేష్ బాబు.. ఎందుకో తెలుసా.. !?

Anilkumar
మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇక వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాకి సంబంధించిన షూటింగ్ మరికొన్ని గంటల్లో మొదలుకానంది. ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే మరియు శ్రీ లీల నటిస్తున్నారు.ఇక ఈ సినిమా ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు నెల 11న విడుదల కానుంది. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు ఒకేలాగా కనిపిస్తారు అని రొటీన్ గా ఒకే లుక్ లో ఉంటారు అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మహేష్ బాబు ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు అని తెలుస్తోంది.

 ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తిగా తన లుక్ ని మార్చేసాడట. పొడవాటి జుట్టుతో మహేష్ బాబు ఈ సినిమాలో కనిపిస్తాడు అని తెలుస్తోంది. ఇక తాజాగా ఇండస్ట్రీ వర్గాల లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రెట్రోలుక్ లో సన్నని గడ్డంతో మహేష్ బాబు కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ప్రేక్షకులకు  ఈ లుక్ బాగా నచ్చింది అని అంటున్నారు. అంతేకాదు భవిష్యత్తు పిల్లలు కూడా మహేష్ బాబు ఈ లుక్ లో కనిపిస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు త్రివిక్రమ్ 30 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నాడట.

కాగా ప్రముఖ ఓటిటి సంస్థలో ఒకటైన నెట్ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. గత కొంతకాలం క్రితం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడం జరిగింది. అంతేకాదు నెట్ఫ్లిక్స్ ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోని క్రేజీ సినిమాలు హక్కులను కూడా కొనుగోలు చేసింది. ప్రస్తుతం నెట్ఫిక్స్ సౌత్ ఇండియాలోనే ఊహించిన స్థాయిలో సబ్స్క్రైబర్లను పెంచుకోవాలని భావిస్తుంది. ఇక ఈ సినిమాతో అయినా నెట్ఫ్లిక్స్ కోరుకుంటుంది జరుగుతుందో లేదో చూడాలి.అంతేకాదు నెట్లిక్స్ అమెజాన్ ప్రైమ్ , డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ,జి ఫైవ్ ఆహా వంటి ఓటీటీలకు సైతం గట్టి పోటీని ఇస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: