ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా లేనట్టేనా..!?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు తమ తదుపరి సినిమాలపై ఫోకస్ పెడుతూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.ఈ నేపథ్యంలోని తన తదుపరిచిత్రాలపై ఏమాత్రం క్లారిటీ లేకుండా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఏడాదికి గాను రెండు మూడు సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు ఆయన హీరోగా నటించిన అరవింద సమేత సినిమా తరువాత త్రిబుల్ ఆర్ సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో నటిస్తున్నాడు అన్నది ఆయన అభిమానులకే కాదు ఆయనకి కూడా తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు రాలేదు.

దాదాపు ఈయన సోలో హీరోగా నటించిన సినిమా విడుదలై ఐదేళ్లు అయింది. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఎప్పుడెప్పుడు నటిస్తాడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం ఇద్దరి హీరోలకి ఫ్యాన్ వరల్డ్ రేంజ్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఇంతటి గుర్తింపు వచ్చినప్పటికీ ఆయన అభిమానులకు మాత్రం కాస్త కూడా సంతోషం లేకుండా పోయింది. అయితే గతంలో త్రిబుల్ ఆర్ సినిమా అనంతరం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్నారని ప్రకటించడం జరిగింది. ఇక ఆ వార్తకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.కనీసం ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. 

ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను ఈ నెల ఫిబ్రవరి నుండి ప్రారంభించనున్నారు అని గతంలో అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు రానుంది అన్న వార్తలు వినిపించాయి.అయితే సలార్ సినిమా ప్రారంభానికి ముందే ఈ సినిమా కన్ఫామ్ అయ్యింది. కానీ ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నది మాత్రం తెలియదు. దీంతో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అసలు సినిమా ఉంటుందో లేదో అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటి అంటే ప్రస్తుతం  ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభిస్తారు అని భావించారు. కానీ ఇప్పుడు దిల్ రాజు కాంబినేషన్లో ప్రభాస్ మరియు ప్రశాంత్  కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అని ..ఆ సినిమా పేరు "రావణం" అని ఒక వార్త రావడం జరిగింది. ఇటీవల ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా అయిన వెంటనే రావణం సినిమా పట్టాలెక్కుతుంది అన్న వార్తలు వినిపించాయి. ఇక దీని అనంతరం కే జి ఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించడం జరిగింది. ఇలా వరుసగా ప్రశాంత్ నీల్  సినిమాలు చేసుకుంటూ పోతే మరి ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు చేస్తాడు అన్న టెన్షన్ వారి అభిమానుల్లో నెలకొంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: