బాలయ్య లైనప్ మాములుగా లేదుగా?

Purushottham Vinay
నందమూరి నటసింహం బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నారు. గత సంవత్సరం అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఇక రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.బ్లాక్ బస్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదలై చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. కాబాక్సఫీస్ దగ్గర ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. అఖండ సినిమా తరువాత మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు బాలయ్య. ఇక ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా కూడా పూర్తవ్వడంతో తరువాత సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బాలకృష్ణ సక్సెస్ ఫుల్ దర్శకుడు అయిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.


అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి సంబంధించి పూజాకార్యక్రమం కూడా ఈ మధ్యనే జరిగింది. ఈ మూవీ అనిల్ స్టైల్ లో కామెడీతో పాటు ఇంకా అలాగే బాలయ్య స్టైల్ లో యాక్షన్ తో కూడి ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనున్నారు.ఆయన కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించనుంది.ఇక ఈ సినిమా తరువాత అలాగే తనకు అఖండ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయనున్నారు బాలయ్య. ఇక ఈ రెండు సినిమాలే కాకుండా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుంది. అలానే 'బింబిసార' దర్శకుడు వశిష్ట్ తో కలిసి మరో సినిమా చేయనున్నారు బాలయ్య. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో కూడా  బాలయ్య ఓ సినిమా చేసే అవకాశం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: