భోళా శంకర్: షూటింగ్ స్టార్ట్.. ఇక రచ్చ రచ్చే?

Purushottham Vinay
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. బాబీ దర్శకత్వం వహించిన వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి చిరంజీవికి మంచి కం బ్యాక్ హిట్ ని ఇచ్చింది.ఫస్ట్ షో నుంచే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మెగా అభిమానులు తారా స్థాయిలో సంబరాలు చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ మాసాల పాత్రలో నటించి ఎంతగానో మెప్పించి అలరించారు. ఇక చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా భోళాశంకర్. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన మెహర్ రమేష్ దర్శకత్వంలో  ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతుంది. 


ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇక "భోలా శంకర్" సినిమా షూటింగ్ ఈ రోజు(జనవరి 17న) స్టార్ట్ అయ్యింది. మెగా బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ వైబ్‌ను కొనసాగిస్తూ హై పాజిటివ్ ఎనర్జీతో అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ఈ రోజు స్టార్ట్ అయ్యింది.వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో భోళా శంకర్‌ సినిమాపై కూడా ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.డైరెక్టర్ మెహర్ రమేష్, చిరంజీవిని చాలా స్టైలిష్, ఇంకా మాస్ క్యారెక్టర్‌లో చూపిస్తున్నాడు. ఈ సినిమాలో  కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా చిరుకి జోడీగా హీరోయిన్ గా కనిపించనుంది.క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతం అందించగా ఇంకా డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: