"వాల్తేరు వీరయ్య" ఫస్ట్ వీకెండ్ ఏరియా వైస్ ఓవర్సీస్ కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా , క్యాథరిన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. మాస్ మహారాజ రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , ప్రకాష్ రాజ్ , బాబి సింహ విలన్ పాత్రలలో నటించారు. శ్రీనివాస్ రెడ్డి , షకలక శంకర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి ఓవర్సీస్ లో కూడా సూపర్ కలక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఏరియా వైస్ గా ఓవర్సీస్ లో ఏ రేంజ్ కలెక్షన్.లు దక్కయో తెలుసుకుందాం.


యూఎస్ఏ లో 14.21 కోట్ల కలెక్షన్ లు దక్కగా , ఆస్ట్రేలియాలో 1.21 కోట్లు , న్యూజిలాండ్ లో 8.9 లాక్స్ ,  యూకే లో 1.29 కోట్లు ,  యూఏఈ లో 1.05 కోట్లు ,  52 లక్షలు , రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ఒక కోటి కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి 19.4 కోట్ల కలెక్షన్ లభించాయి. ఫస్ట్ వీకెండ్ లో వాల్తేరు వీరయ్య మూవీ కి ఓవర్సీస్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: