ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను హీరో చేశాడు : బ్రహ్మాజీ

praveen
ఇటీవల కాలంలో ఎంత పెద్ద సహాయం చేసినా కూడా వారిని కొన్ని రోజుల్లోనే మరిచిపోతున్నారు జనాలు. కానీ ఒకప్పుడు మాత్రం ఇలా ఉండేది కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ చిన్న సహాయం చేసిన కూడా దాన్ని ఇక జీవితాంతం గుర్తు పెట్టుకొని సమయం సందర్భం వచ్చినప్పుడు ఇక రుణం తీర్చుకోవడం లాంటివి చేసేవారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇలాంటి ఒక అరుదైన ఉదాహరణ చెప్పాడు నటుడు బ్రహ్మాజీ. దర్శకుడు కృష్ణవంశీకి తాను ఒక్క పూట అన్నం పెట్టిన కారణంగా ఏకంగా తనను హీరోగా పెట్టి సినిమా తీశాడు అన్న విషయాన్ని ఇటీవల బ్రహ్మజి గుర్తు చేసుకున్నాడు. గతంలో అవకాశాల కోసం ఇక ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకున్నప్పుడు చెన్నైలో బ్రహ్మాజీ, కృష్ణవంశీ వేరువేరు గదుల్లో ఉండేవారట.

 ఆ సమయంలో ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి.. అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకోవడమే లక్ష్యంగా ఎప్పుడూ తిరుగుతూ ఉండేవారట. అలాంటి సమయంలోనే కృష్ణవంశీ అప్పటికే రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట. అలాంటి సమయంలో ఇక బ్రహ్మాజీ కృష్ణవంశీని రోజు సెట్స్ దగ్గర దిగబట్టే వాడట. అయితే ఇలా వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే బ్రహ్మాజీ కి సినిమాల్లో మాత్రం అవకాశాలు రాలేదు. కానీ ఇంటి నుంచి డబ్బు వస్తుండడంతో ఎలాంటి కష్టాలు ఉండేవి కాదట. కృష్ణవంశీ మాత్రం తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బంది పడేవాడట. ఒకసారి చేతిలో డబ్బులు లేకపోవడంతో రెండు రోజులుగా అన్నం తినకుండానే పస్తులు ఉన్నాడట కృష్ణవంశీ.

 ఇక ఆ సమయంలో బ్రహ్మజీ దగ్గర కూర్చున్నాడట. ఇక మధ్యాహ్నం సమయం కావడంతో వెళ్లి తిందాం పద అని బ్రహ్మాజీ చెప్పడంతో ఇక అప్పటికే ఆకలితో ఉన్న కృష్ణవంశీ నో చెప్పలేకపోయాడట. ఇక ఆకలితో ఉన్న కృష్ణవంశీకి బ్రహ్మాజీ భోజనం పెట్టించడంతో ఆ సమయంలో దేవుడిలా కనిపించాడట. ఈ ఒక్క ఘటనతో బ్రహ్మాజీ  కృష్ణ వంశీకి మరింత ఆప్తుడుగా మారిపోయాడు. ఈ క్రమంలోనే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమాలో బ్రహ్మాజీని హీరోగా పెట్టేసాడు కృష్ణవంశీ. ఇలా ఒక్కపూట అన్నం పెట్టినందుకు ఏకంగా తనను హీరోగా పెట్టి సినిమా తీశాడు అంటూ కృష్ణవంశీ గురించి అప్పుడప్పుడు బ్రహ్మాజీ చెబుతూ ఉంటాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: