చిరంజీవి సినిమా వల్లే.. ఆ రచయిత కెరియర్ నాశనమైందా?

praveen
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఊహించడం కష్టం. అప్పటివరకు ఒక సాదాసీదాగా హీరోగా ఉన్నవారు స్టార్ హీరోగా మారిపోవడం.. స్టార్ హీరోగా ఉన్నవారు అవకాశాలు లేక కనుమరుగవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే పైకి ఎంతో అందంగా కనిపించే సినిమా ప్రపంచంలో ఊహించని కష్టాలు ఎన్నో ఉంటాయి అన్నది ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు చెబుతున్న మాట. అయితే ఇప్పుడు వరకు ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో రాణించిన హీరో హీరోయిన్లు ఎంతోమంది ఆ తర్వాత కాలంలో ఇక ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన వారు చాలామంది ఉన్నారు.

 అయితే కేవలం సినిమా హీరో హీరోయిన్లు మాత్రమే కాదండోయ్ రచయితల విషయంలో కూడా ఇలా చాలానే జరిగింది అని చెప్పాలి. అయితే తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ రచయితగా పేరు సంపాదించుకున్నారు ఎండమూరి వీరేంద్రనాథ్. ఈయన ఎన్నో స్టార్ హీరోల సినిమాలకు రచయితగా పనిచేశారు అని చెప్పాలి. అలాంటి గొప్ప రచయిత ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయిపోయారు. అయితే ఇలా ఇండస్ట్రీలో ఆయన కనుమరుగు అవ్వడానికి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కారణం అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ మధ్య సినిమాలు చూడడమే మానేసాను అంటూ ఆయన తెలిపారు. ఇక అభిలాష సినిమా స్క్రిప్ట్ లో నా ప్రమేయం ఉంది. ఇక ఈ సినిమాకు పని చేసినందుకు 25000 పారితోషికం ఇచ్చారు. నేను రచయితగా ఉన్నాను. ఏ సినిమాకి దర్శకత్వం చేయలేదు. అన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే మాత్రమే అందించాను. ఇక చివరిగా నా కెరియర్లో స్క్రీన్ ప్లే ఇచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అవి చిరంజీవి నటించిన మృగరాజు, ఎన్టీఆర్ నటించిన శక్తి, ఇక మరో సినిమా అనామిక. ఇక ఈ మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో తర్వాత తనకు అవకాశాలు రాలేదు. ఇక ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాను అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: