కాన్సర్ పేషెంట్ కోసం అన్ని లక్షలు సహాయం చేసిన బాలయ్య..!?

Anilkumar
నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ఆయనలోని టెంపర్ మాత్రమే అందరికీ కనబడేది. కానీ ఆయనది చాలా చిన్న పిల్లల మనస్తత్వం.. మనుషులతో ఇట్టే కలిసిపోతారు.. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో సరదాగా ఉంటాడు.. దీనికి తోడు బాలకృష్ణ సేవా కార్యక్రమాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా బాలయ్య ఎవరిని క్షమాపణలు అడగడు.. అలాంటిది మొదటిసారి తన మాటల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ అడిగారు. పొరపాటున తెలియక అలా మాట్లాడను నన్ను మన్నించండి అంటూ క్షమాపణలు కోరారు బాలకృష్ణ. 

అలా ఎవరూ ఊహించిన విధంగా ఒక మెట్టు దిగి ఒకేసారి పది మెట్లు ఎక్కడో బాలయ్య. అయితే ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేయడంలో బాలయ్య చాలాసార్లు తన మంచి మనసును చాటుకున్నాడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎందరో పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని చేస్తున్నారు బాలయ్య. క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా క్యాన్సర్ తో బాధపడుతున్నా ఒక అమ్మాయికి ఆయన సొంత ఖర్చుతో వైద్యాన్ని చేయించారు బాలయ్య. ఇక అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న 

నేపథ్యంలో ఆపరేషన్ కి గాను 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పడం జరిగింది. పేద కుటుంబం కావడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంత మొత్తంలో డబ్బు లేక అమ్మాయిని హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లలేదు తల్లిదండ్రులు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న బాలయ్య ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. చెప్పడమే కాకుండా వెంటనే ఆ అమ్మాయిని హాస్పిటల్ లో చేర్పించి వైద్యాన్ని అందించారు. తాజాగా ఈ విషయాన్ని సినీ పరిశ్రమకు చెందిన పి.ఆర్.వంశీ శేఖర్ ఆయన సోషల్ మీడియా వేదికగా చెప్పవచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: