నాని దసరా మూవీ రిలీజ్ డేట్ లాక్..!

Divya
నాచురల్ స్టార్ నాని ఇటీవల అంటే సుందరానికి సినిమాలో నటించి ఘోర పరాజయాన్ని పొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గత ఏడాది ఆగస్టులో నాచురల్ స్టార్ నాని.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో తన మొదటి ప్రాజెక్టు దసరా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఒక కొత్త పోస్టర్ ని కూడా ఆవిష్కరించి.. నాని దసరా సినిమా మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అని స్పష్టం చేశారు.

గతంలో నాని సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ను  రిలీజ్ చేసినప్పుడు వెనుక పోస్టర్లో అలనాటి దివంగత నటి సిల్క్ స్మిత యొక్క భారీ పోస్టర్ ముందు కఠినమైన అవతారంలో నాని కూర్చొని ఉండడం మనం చూడవచ్చు. ఇకపోతే దసరా సినిమా " మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎట్లైతే గట్లయే సూస్కుందాం ఇది చాలా కాలం గుర్తుండిపోతుంది".. అని ట్యాగ్ లైన్ తో ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు. ఇకపోతే నాని నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదివరకే నేను లోకల్ సినిమాలో నానితో కలిసి నటించిన ఈమె ఇప్పుడు మళ్లీ దసరా సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నేను లోకల్ సినిమాతో హిట్  పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట..  ఇప్పుడు ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.  ఇకపోతే ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.  పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో సముద్రఖని , షమ్న ఖాసిం , రాజేంద్రప్రసాద్ , ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు.  గ్రామీణ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని ధరణి అనే క్యారెక్టర్ పోషిస్తున్నాడు. మాస్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: