ఈ డైరెక్టర్ల ఆస్తులు ఎంతో తెలుసా.. హీరోలు కూడా పనిచేయరు?

praveen
సాధారణంగా హీరోలతో పోల్చి చూస్తే అటు నిర్మాతలకు రెమ్యూనరేషన్ కాస్త తక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అటు ఆస్తులు కూడా హీరోలతో పోలిస్తే దర్శకులకు తక్కువగానే ఉంటాయని అందరూ భావిస్తూ ఉంటారు.  కానీ ఇటీవల కాలంలో భారతీయ సినిమా పరిశ్రమంలో మాత్రం అటు హీరోల కంటే ఎక్కువగా ధనవంతులైన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక హీరోలకు మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లు కూడా నేటి రోజుల్లో కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో దర్శక ధీరుడు  రాజమౌళి ఒకరు అని చెప్పాలి.

 దర్శకతీరుడు రాజమౌళి ఒక సినిమాను టేక్ ఆఫ్ చేశాడు అంటే చాలు నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా సరే పూర్తిగా అతని చేతిలో సినిమాలు పెట్టేస్తూ ఉంటారు. అంతలా తన సినిమాలతో ప్రభావితం చేశాడు రాజమౌళి. ఈయన మాత్రమే కాకుండా మరికొంతమంది కూడా హీరోలకు మించిన ధనవంతులు ఉన్నారు అని చెప్పాలి. జిక్యూ ఇండియా ధనవంతులైన దర్శకుల జాబితాను ప్రకటించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ వివరాలు చూసుకుంటే..

 హీరోల కంటే ఎక్కువ ధనవంతులైన దర్శకులలో దర్శకుడు నిర్మాత కరణ్ జోహార్ మొదటి స్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ లోనే కాదు దక్షిణాదిలో కూడా ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఇక కరణ్ జోహార్ ఆస్తి విలువ 1650 కోట్లకు పైగా ఉంటుందట. ఇక రెండవ స్థానంలో రాజ్ కుమార్ హిరానీ 1150 కోట్లతో ఉండగా.. మూడవ స్థానంలో 900 కోట్లతో సంజయ్ లీలా బన్సాలి ఉన్నారు. ఇక ఆ తర్వాత అనురాగ కశ్యప్ 770 కోట్లు, కబీర్ ఖాన్ 300 కోట్లు, రోహిత్ శెట్టి 250 కోట్లు, దర్శకుడు రాజమౌళి 150 కోట్లు, జోయా అక్కర్ 76 కోట్ల ప్రాపర్టీని కలిగి ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: