విజయ్ సేతుపతి ఫర్జీ ట్రైలర్ వాయిదా..!

Divya
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న ఓటీటీ తొలి చిత్రం ఫర్జీ.. రాజ్ నిడిమూరు మరియు కృష్ణ డీకే రూపొందించిన ప్రైమ్ వీడియో ఇది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అలాగే విజయ్ సేతుపతి మొదటిసారి కలసి ఓటీటీ డిజిటల్ రంగ ప్రవేశం చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కపోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే తేదీ ప్రకటనతో విడుదల చేసిన పోస్టర్లలో షాహిద్ ను మోసగాడిగా చూపించగా విజయ్ ను లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా అతన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించినట్లు చూపించారు.
ఇకపోతే స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నుండీ  నటీనటుల రెండు పోస్టర్లను విడుదల చేశారు మేకర్స్... మొదటిది కౌన్ హే యే ఫర్జీ? అని ఒక పోస్టర్ విడుదల చేశారు.  ఇందులో షాహిద్ ముదురు బూడిద రంగు టీ-షర్ట్ లో భారత కరెన్సీ తో తయారుచేసిన ఫర్జీ అనే టైటిల్ మధ్య కనిపించాడు. ఇకపోతే ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఈ పోస్టర్ చూసి పోస్టుపై ఫైర్ ఎమోజీలను కూడా షేర్ చేశారు. ఒక అభిమాని కూడా ఇలా వ్రాసుకొచ్చారు.  షాహిద్ కపూర్ ను  చెడ్డవాడిగా నేను చూడాలనుకుంటున్నాను? అంటూ కామెంట్లు చేశారు.
ఇకపోతే ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను ఈరోజు సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించారు.  కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ సేతుపతి,  షాహిద్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ నుంచీ ట్రైలర్ ను ఈరోజు విడుదల చేయాలనుకున్నారు.  కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో హీరోయిన్ గా విజయ్ సేతుపతి సరసన  రాశి ఖన్నా నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: