జబర్దస్త్ లోకి వచ్చిందో లేదో.. యాంకర్ సౌమ్యకి సినిమాలో ఛాన్స్?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఎప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం అందరికీ తెలుసు. దశాబ్ద కాలానికి పైగానే ఇలా బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ కు చిరునామాగా మారిపోయింది ఈ కార్యక్రమం. అయితే కేవలం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడం కాదు.. ఎంతోమంది ఆప్ కమింగ్ కమెడియన్స్ కి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది అని చెప్పాలి. యాంకర్ల దగ్గర నుంచి కమెడియన్స్ వరకు ప్రతి ఒక్కరినీ ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యేలా చేసింది .

 అందుకే జబర్దస్త్ లో ఒక్కసారి ఛాన్స్ వచ్చిన చాలు తమ సత్తా ఏంటో నిరూపించుకోవచ్చు అని అందరూ భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల జబర్దస్త్ లో కొత్త యాంకర్ గా బుల్లితెర నటి సౌమ్యారావు ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. తెలుగు రాకపోయినా క్యూట్ క్యూట్ తెలుగు తో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు అందరినీ కూడా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట ఈ అమ్మడుతో కేవలం రెండు మూడు ఎపిసోడ్లు మాత్రమే చేయించాలి అనుకుని భావించారు మల్లెమాల నిర్వాహకులు. కానీ ఇక జబర్దస్త్లో ఆమె ఇమిడిపోవడం.. ఇక ఆమె క్యూట్ నెస్ అభిమానులకు కనెక్ట్ కావడంతో ఇక పర్మినెంట్  యాంకర్ గా చేసేసారు.

 అయితే జబర్దస్త్ లాంటి షోలో కనిపిస్తే చాలు సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అన్నది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు అయింది. ఇక ఇప్పుడు కొత్త యాంకర్ సౌమ్య రావు విషయంలో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి.. జబర్దస్త్ లో యాంకరింగ్ తో అదరగొడుతున్న సౌమ్యరావు ఇక జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు నెలల్లోనే ఒక లక్కీ ఛాన్స్ ను కొట్టేసిందట. ఒక యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరో చిన్న సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశాన్ని కూడా సొంతం చేసుకుందట. మరికొన్ని రోజుల్లో అనసూయ మాదిరిగానే ఫుల్ బిజీ అయ్యే అవకాశం ఉంది అన్నది కూడా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: