అజిత్ తునివు ట్విట్టర్ రివ్యూ..!
సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రీమియర్స్ రాత్రి నుంచి సందడి చేయగా సినిమా చూసిన ఆడియన్స్ అజిత్ అభిమానులు ట్విట్టర్ ద్వారా రివ్యూ ఇస్తున్నారు.. ట్విట్టర్లో ఆడియన్స్ చేస్తున్న హడావిడి చూస్తుంటే అజిత్ హ్యాట్రిక్ సక్సెస్ కొట్టినట్లే అని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే అన్నీ కూడా పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అజిత్ బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు హెచ్ వినోద్ కథలో డెప్త్ ఉంటుంది కాబట్టి పరిశోధించిన తర్వాతనే కథను తీసుకున్నాడు అంటూ కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇకపోతే కామన్ ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా అజిత్ తెగింపు సినిమా చూసి ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా రమేష్ బాల , అరుణ్ విజయ్ లాంటి వారు కూడా సినిమాపై ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. కథ, స్క్రీన్ ప్లే ముఖ్యంగా అజిత్ సార్ యాక్టింగ్ సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. మొత్తానికైతే ఒకవైపు డైరెక్టర్ వినోద్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తూనే... సినిమా అంతా అజిత్ ఒక్కడే దడదడలాడించేశాడు అని.. వన్ మ్యాన్ షో అని తెగ పొగిడేస్తున్నారు. ఏది ఏమైనా అజిత్ సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించినట్టే అని చెప్పవచ్చు.