మరో తెలుగు డైరెక్టర్ కు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన హీరో ధనుష్?

praveen
బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకులకు ఎంతలా డిమాండ్ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క రాజమౌళికి మాత్రమే కాదు ఇతర దర్శకులతో సినిమాలు తీయడానికి కూడా ఇక వేరే భాష ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్ హీరోలు సైతం సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక కన్నడ మలయాళం లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇక ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న ధనుష్ సైతం ఎక్కువగా ఫ్యూచర్ మూవీస్ కోసం తెలుగు దర్శకులను సెలెక్ట్ చేసుకోవడం విశేషం.

 ఇప్పటికే స్టార్ హీరోగా కొనసాగుతూ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు హీరో ధనుష్. రజనీకాంత్ అల్లుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ కూడా అటు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఓ తెలుగు దర్శకుడు తో సినిమా చేసేసాడు.  తొలిప్రేమ, మిస్టర్ మజ్ను అనే సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వెంకీ అట్లూరితో సార్ అనే సినిమాను చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నాడు  ధనుష్.

 ఇలాంటి సమయంలోనే మరో టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ తో కూడా సిద్ధమయ్యాడు స్టార్ హీరో ధనుష్. ఏకంగా ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగే శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నాడన్న విషయం తెలిసింది. ఏషియన్ సినిమాస్ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్క పోతుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందట. ఇప్పటికే ఇలా ఇద్దరితో సినిమాలు చేస్తుండగా.. ఇక మరో తెలుగు డైరెక్టర్కు కూడా ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. శ్రీకరం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న.. బి. కిషోర్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట ధనుష్. బి కిషోర్ చెప్పిన కథ ధనుష్కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాడట. ఇక ఈ సినిమాను దిల్ రాజు  నిర్మించే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: