దిల్ రాజుకు భయపడబోమని చెప్పిన కళ్యాణం కమనీయం టీమ్.. రిలీజ్ పక్కా..!

Divya
దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రం రిలీజ్ డేట్ మారుస్తూ మూడు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 14వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు దిల్ రాజు సోమవారం మీడియాతో మాట్లాడుతూ వివరించాడు. విజయ్ లాంటి పెద్ద హీరో సినిమా.. పైగా దిల్ రాజు సినిమా కావడంతో కళ్యాణం కమనీయం సినిమా వాయిదా పడుతుంది.. ఒక్కరోజు వెనక్కి వెళ్తుందని వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతలకు కూడా భయపడబోమని చెప్పిన డేట్ లోనే సినిమాను రిలీజ్ చేస్తాము అని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.
చిత్ర దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.  సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి ఎన్నో విషయాలను ముచ్చటించారు.  ఇకపోతే ఈ సినిమాను యు వి కాన్సెప్ట్ నిర్మించింది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు శోభన్ వారసుడు సంతోష్ శోభన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.  హీరోయిన్గా ప్రియ భవాని శంకర్ నటిస్తోంది.  ఇకపోతే జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం.  అంతేకాదు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఫ్యామిలీ ,ఎమోషన్స్ , సెంటిమెంట్స్ , కామెడీ మేళవింపుగా ఈ సినిమా ఉంటుంది అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. పెళ్లయ్యాక భర్తకు జాబ్ లేకుంటే ఒక భార్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నాము.. అయితే అదొక్కటే కాదు ట్రైలర్లో రివీల్ చేయని ఎన్నో అంశాలు కూడా సినిమాలో ఉంటాయి. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న యువ జంటగా శివ, శృతి పాత్రల్లో వారి నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.. శృతి క్యారెక్టర్ ను ప్రియ పర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేసిందని నా అభిప్రాయం.  తమ చుట్టూ జరిగే ఈగో గేమ్స్ ను  ఈ యువ జంట ఎలా ఎదుర్కొంది ..అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అంటూ తెలిపారు డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: