'నాటు నాటు' కంటే నాకు ఆ సాంగ్ అంటేనే చాలా ఇష్టం: రాజమౌళి

Anilkumar
ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ ఆర్ ఆర్' మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శక దిగజం రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం జరిగింది. తాజాగా బ్రిటిష్ అకాడమీ ఆప్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో బెస్ట్ ఫిలిం గా ఈ సినిమా ఎంపికైంది. జనవరి 11న లాస్ ఏంజెల్స్ లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం మూవీ టీం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఇక శనివారం లాస్ ఏంజెల్స్ లో ఉన్న డీజీఏ థియేటర్లో త్రిబుల్ ఆర్ సినిమాని ప్రదర్శించారు.
ఇక చిత్ర ప్రదర్శన అనంతరం ఎన్టీఆర్, రాజమౌళి హాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ..' ఈ సినిమాలోని నాటునాటు పాట కోసం రాజమౌళి 65 రాత్రులు నన్ను టార్చర్ చేశాడంటూ చెప్పుకొచ్చాడు. నాటు నాటు అనే సాంగ్ ని 12 రోజుల్లో షూటింగ్ చేశాం. ఈ సాంగ్ పర్ఫెక్షన్ రావడం కోసం రాజమౌళి విపరీతమైన ప్రాక్టీస్ చేయించాడు. ఈ సాంగ్ పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందంటూ వెల్లడించాడు తారక్. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ..' తనకు ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట కంటే 'కొమురం భీముడో' అనే పాట చాలా ఇష్టమని చెప్పారు. 

కొమురం భీముడో పాటలో తారక్ నటన నా అన్ని చిత్రాల కంటే ఆల్ టైం ఫేవరెట్. ఇంతవరకు నేను నా సినిమాలో అంత మంచి సీన్స్ డైరెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ ఎంత టాలెంటెడ్ యాక్టర్ అంటే అతని ఒక కంటి నోస మీద కెమెరా పెట్టినా.. ఆ ఒక్క కంటి నొస తోనే యాక్టింగ్ చేయగలడు' అంటూ తారక్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. దీన్నిబట్టి త్రిబుల్ ఆర్ సినిమాలో రాజమౌళికి కొమురం భీముడో అనే సాంగ్ ఎంత ఇష్టమో ఆయన మాటల ద్వారానే స్పష్టమవుతోంది. ఇక గత ఏడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలు అవార్డ్స్ ని సైతం అందుకుంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఫారిన్ ఫిలిం తో పాటు సినిమాలోని నాటు నాటు సాంగ్ మ్యూజిక్ క్యాటగిరిలో చోటు దక్కించుకుంది. అంతేకాదు అటు ఆస్కార్స్ లో కూడా నాటు నాటు సాంగ్ ఎంపికైన విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: