శేష్ G2 ప్రీ-విజన్ విడుదల.. సూపర్?

Purushottham Vinay
ఇక మేజర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాందించుకున్నారు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. ఈ సినిమాలో ఆయన నటనకు గాను ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇటీవలే ఆయన HIT-2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో డబుల్ హ్యాట్రిక్ హిట్‌ మూవీలను పూర్తి చేసిన ఈ టాలెంటెడ్ యంగ్ హీరో ఇక తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సినిమాకి సీక్వెల్ అయిన G2ని అనౌన్స్ చేశారు. గూఢాచారి సినిమా కథ ఇండియాలో సెట్ చేయగా, G2 కథ వచ్చేసి ఏకంగా ఇంటర్ నేషనల్ లెవెల్ లో ఉండబోతోంది. ఈ సినిమాకి కూడా కథను శేష్ స్వయంగా అందించారు. "మేజర్" సినిమా ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ఇంకా అలాగే మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌ మూవీలను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్ ఇంకా అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఇంకా అలాగే ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. 


ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌ లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో పాటు అలాగే "ప్రీ విజన్" వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇక ఫార్మల్ డ్రెస్ లో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్‌ లో ఉన్న శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం ఇందులో కనిపిస్తుంది. ఈ మూవీ కోసం అడివి శేష్ చాలా బాగా మేకోవర్‌ అయ్యారు.ఇక ప్రీ-విజన్ విషయానికి వస్తే, శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల దాకా వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ ని చూపించారు. ఆ తర్వాత G2 సినిమాలో అడివి శేష్ ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 2023 వ సంవత్సరంలో షూటింగ్‌ ప్రారంభమవుతుందని కూడా అనౌన్స్ చేశారు. కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాలు ఇంకా ఇంటర్నేషనల్ టీం పరంగా G2 చాలా అద్భుతంగా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

G2

సంబంధిత వార్తలు: